శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 27 మార్చి 2020 (14:22 IST)

యువ నటుడు సేతురామన్ గుండెపోటుతో మృతి

Sethuraman
కోలీవుడ్‌లో యువ నటుడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో కోలీవుడ్‌ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలముకున్నాయి. కన్న లడ్డు తిన్నా ఆసయ్య ఫేం సేతురామన్ (36) గుండెపోటుతో మృతి చెందాడు. 
 
చిన్న వయస్సులో గుండెపోటుతో సేతురామన్ మరణించడం.. సినీ నటులను, ప్రేక్షకులను షాక్‌కు గురిచేస్తున్నాయి. వృత్తిరీత్యా ఆయన చర్మవ్యాధి నిపుణుడు కాగా, అనేక మంది కోలీవుడ్ నటులతో స్నేహపూర్వక సంబంధాలను పెంచుకున్నాడు.
 
2013లో విడుదలైన కన్నా లడ్డూ తిన్నా ఆసయ్య చిత్రం ద్వారా ఇండిస్టీలో అడుగు పెట్టారు సేతురామన్. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ట్విటర్‌ ద్వారా పలువురు సంతాపం తెలిపారు.