ప్లీజ్, ఇంటి నుంచి బయటకు రావద్దు, విక్టరీ వెంకటేష్ విజ్ఞప్తి
మనదేశాన్ని మనం రక్షించుకోవాలి. మనందరికీ మన దేశానికి సేవ చేసే సమయం వచ్చింది. మనమేమీ చేయలేమనుకోవద్దు. బాధ్యత పెరగాలి. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకుండా ఉండాలి. నేను అదే చేస్తున్నా.
షూటింగ్ పూర్తిగా నిలిచిపోయిన తరువాత నేను ఇంటి దగ్గరే ఉంటున్నాను. సామాజిక బాధ్యతగా నేను తీసుకున్నా. అందుకే నా అభిమానులకు... తెలుగు ప్రజలకు విన్నవిస్తున్నా.. దయచేసి ఇంటి నుంచి బయటకు రావద్దని కోరుతున్నారు విక్టరీ వెంకటేష్.
నా సహచర నటీనటులు, క్యారెక్టర్ ఆర్టిస్టుల బాధ నేను అర్థం చేసుకోగలను. త్వరలో నేను కూడా విరాళం ఇస్తాను. క్యారెక్టర్ ఆర్టిస్టులకు నా వంతు సహాయం చేస్తాను. పనిలేకపోతే డబ్బులు రావడం కష్టమే. అది అందరికీ తెలుసు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు కూడా ఎంతో అప్రమత్తంగా ఉందని చెబుతున్నారు విక్టరీ వెంకటేష్. అయితే రోడ్లపై అభాగ్యులుగా ఉన్న వారికి మాత్రం మన వంతు సాయం అందించాలని.. అవసరమైన భోజనం వారికి అందించడని అభిమానులను వెంకటేష్ కోరారు.