శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 24 మార్చి 2020 (17:12 IST)

గరిటె పట్టిన రేవంత్ రెడ్డి.. కరోనాతో లాక్ డౌన్.. హ్యాపీగా వంట చేస్తూ..?

Revanth Reddy
తెలంగాణలో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఒక్క తెలంగాణలోనే కాకుండా దేశంలోని అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ విధిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ కూడా అమలు చేస్తున్నారు. దీంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమవుతున్నారు. 
 
ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ చేస్తుంటే.. వ్యాపారులు కాస్త విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇన్నాళ్లు బిజీగా గడిపిన వాళ్లంతా కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. 
 
ఇంటి బయట కాలు పెట్టే పరిస్థితి లేకపోవడంతో ఇంట్లోనే కాలక్షేపం చేస్తున్నారు. ఇక రాజకీయ నేతలు కూడా ఇంటికే పరిమితం అవుతున్నారు. ఇలా ఫైర్ బ్రాండ్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మాత్రం వెరైటీగా ఇంటి వద్ద సమయం గడుపుతున్నారు. గరిటె పట్టి కుటుంబ సభ్యుల జిహ్వకు రుచి చూపిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.