ఏపీ కరోనా హెల్త్ బులిటెన్ : హోం ఐసోలేషన్‌లో 25 వేల మంది...

andhra pradesh map
ఠాగూర్| Last Updated: గురువారం, 26 మార్చి 2020 (13:00 IST)
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు తీసుకుంటోంది. ఈ కారణంగానే ఏపీలో కొత్త కేసులు ఎక్కడా నమోదు కావడం లేదు. దీనికి కారణం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన గ్రామ వలంటీర్ వ్యవస్థే.

ప్రతి గ్రామంలో ఉండే గ్రామ వలంటీర్లు.. తమ గ్రామంలోకి వచ్చిన వారందరి వివరాలను సేకరించి ఎప్పటికపుడు ప్రభుత్వానికి చేరవేస్తున్నారు. దీంతో విదేశాలతో పాటు.. కరనా బాధిత రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని సులభంగా గుర్తించి, వారిని హోంక్వారంటైన్‌లో ఉంచున్నారు. ఫలితంగా కొత్త కేసు ఎక్కడా నమోదు కావడం లేదు.

ఈ నేపథ్యంలో తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఈ బులిటెన్‌లో కీలక విషయాలను ఏపీ ప్రభుత్వం వెల్లడించింది.
* ఇప్పటి వరకు విదేశాల నుంచి ఏపీకి వచ్చిన వారి సంఖ్య 26,942.
* వారిలో 25,942 మందిని హోం ఐసొలేషన్ (హోం క్వారంటైన్)లో ఉంచాం.
* కరోనా అనుమానిత లక్షణాలతో ప్రస్తుతం 117 మందికి చికిత్స అందిస్తున్నాం.
* ఇప్పటివరకు 10 మందికి కారోనా పాజిటివ్ వచ్చింది.
* 289 మందికి కరోనా నెగెటివ్ వచ్చింది.
* ఇంకా 33 మంది శాపిల్స్ నివేదిక రావాల్సి ఉంది.
* కరోనా అనుమానాల నివృత్తి కోసం 104 టోల్ ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేసినట్టు పేర్కొంది.దీనిపై మరింత చదవండి :