పిచ్చినాకు కాదు.. మీకు..

Last Updated: శుక్రవారం, 9 ఆగస్టు 2019 (13:34 IST)
వైద్యుడు : నిన్ను పిచ్చాసుపత్రిలో ఎందుకు చేర్చారు?


రోగి : నేను ఐదు వందల పేజీలతో కూడిన ఓ పుస్తకం రాశాను.


వైద్యుడు : అందులో ఏం రాశావేంటి?


రోగి : మొదటి పేజీలో రాజుగారు గుర్రంమీద వేటకి బయలుదేరుతారు. చివరి పేజీలో అడవికి చేరుకుంటారు అని రాశాను.


వైద్యుడు : మిగిలిన పేజీల్లో ఏమని రాశావు.


రోగి : గుర్రం డిక్ చిక్ డిక్ చిక్ డిక్ చిక్ అని శబ్దం చేసుకుంటూ నడుస్తూ ఉంటుంది.


వైద్యుడు : నీ మొహం తగలెయ్యా... అన్ని పేజీల్లో అలాంటిది ఎవరైనా చదువుతారా?

రోగి... పిచ్చి నాకు కాదు.. నీకు.. అదంతా ఓసారి వాట్సాప్‌లో పెట్టిచూడు. లక్షల మంది చదువుతారో లేదో!!!దీనిపై మరింత చదవండి :