మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By
Last Updated : గురువారం, 1 ఆగస్టు 2019 (20:20 IST)

టైంపాస్‌ రష్మీ గౌతమ్ 'శివరంజని' మూవీ రివ్యూ

వెండితెరకు సేఫ్‌ ప్రాజెక్ట్‌ సస్పెన్స్‌ థ్ల్రిలర్‌ కథాంశాలు. వాటిలో చాలామటుకు సక్సెస్‌లు సాధించాయి. చిన్నబడ్జెట్‌తో ఇంతకుముందు రెండు సినిమాలకు దర్శకత్వం వహించిన నాగ ప్రభాకర్‌ మరో ప్రయత్నం చేశారు. ఈసారి అందరికీ తెలిసిన రష్మిని ప్రధాన పాత్రగా ఎంచుకున్నారు. హీరో నందు కూడా తోడయ్యాడు. ట్రైలర్‌లో ఆసక్తి కలిగించిన ఈ చిత్రం 'శివరంజని'. శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం ఎలా వుందో చూద్దాం.
 
కథ: 
ఓ ప్రమాదంలో కన్పించిన రష్మీని, కార్తిక్‌ (నందు) ఆసుపత్రిలో చేర్పిస్తాడు. అయితే ఆమె గతం మర్చిపోయిందని డాక్టర్లు చెప్పడంతో ఆమె గురించిన వివరాలతో ఓ ప్రకటన ఇస్తాడు. అలా ఇచ్చి ఆమెను తన ఇంటికి తీసుకువస్తాడు కార్తీక్‌. ఆమెను మధుగా అందరికీ పరిచయం చేస్తాడు. అనంతరం ఇద్దరూ ప్రేమలో పడతారు. అయితే సాఫీగా సాగుతున్న వారి జర్నీలో మధుని ఎవరో వెంటాడుతున్నట్లు తెలుస్తుంది. 
 
ఒక నీడలా వున్న అది ఓ ఆత్మను తెలుసుకున్న తర్వాత మధుకు కొన్ని అసలైన నిజాలు తెలుస్తాయి. సరిగ్గా ఈ టైంలో ఓ వ్యక్తి వచ్చి ఈమె పేరు శివరంజనీ అని ఈమె తన భార్య అని ఇంటికి తీసుకెళ్ళతాడు. ఆ తర్వాత మధు ప్రవర్తనలో మార్పు రావడంతోపాటు అసలు నిజం తెలియగానే ఆ వ్యక్తి మధును చంపేందుకు యత్నిస్తాడు. ఆ తర్వాత ఏమయింది? అసలు మధు ఎవరు? మధును ఇంటికి తీసుకువెళ్లిన వ్యక్తికీ సంబంధం ఏమిటి? మధ్యలో ఢిల్లీరాజేశ్వరి పాత్ర ఏమిటి? అనేది మిగిలిన సినిమా.
 
విశ్లేషణ: 
ఇది పూర్తి సస్పెన్స్‌ థ్రిల్లర్‌ కథ. దర్శకుడు దాన్ని రాసుకున్న విధానం సస్పెన్స్‌ను క్రియేట్‌ చేస్తుంది. ఓ దశలో ఆసక్తి రేపుతుంది. టైటిల్‌ చిత్రానికి కరెక్ట్‌గా సరిపోయింది. కథనం ఆసక్తిగా సాగుతూ మధ్యలో వచ్చిన ట్విస్ట్‌లు థ్రిల్‌కు గురిచేస్తాయి. ముఖ్యపాత్ర రష్మీకి "గుంటూరు టాకీస్‌"లో ప్రత్యేకమైన ముద్ర ఏర్పడింది. కానీ ఈ చిత్రంలో ఆమె పాత్ర గుర్తిండిపోయేలా వుంది. నటిగా న్యాయం చేసినా డబ్బింగ్‌ కూడా తనే చెప్పుకుంటే మరింత బాగుండేది. ఇలాంటి కథల్ని ఎంత ఆసక్తిగా చూపించితే అంత బాగుంటుంది. 
 
ఆ క్రమంలో వచ్చే కొన్ని లాజిక్కులు కీలకం. వాటిని దర్శకుడు తనపరిధి మేరకు చూపించాడు. ఓ చోట ఎడింగ్‌ లోపం కన్పిస్తుంది. ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌గా అన్పిస్తూ కొద్దిగా కన్‌ఫ్యూజ్‌ క్రియేట్‌ చేస్తుంది.  ప్రధానంగా శివరంజని ఎవరు అనే అన్వేషణ ప్రేక్షకుల్లో మొదలవుతుంది. అదే చిత్రంలో సస్పెన్స్‌. ఆ పాయింట్‌కి ఎక్కడా కూడా గ్రిప్‌ పోకుండా తెరమీద చెప్పాడు దర్శకుడు. శేఖర్‌ చంద్ర అందించిన మ్యూజిక్‌ రీరికార్డింగ్‌ ఆకర్సణగా నిలిచాయి. యూ అండ్‌ ఐ ప్రొడక్షన్‌ వాల్యూస్‌ బాగున్నాయి. 
 
అయితే ఇలాంటి కథలకు అసలు విలన్‌ ఎవరనేది ట్విస్ట్‌. ఇందులో అఖిల్‌ కార్తిక్‌ నటన ప్రధాన ఆకర్షణ. ఇందులో ఎవరు వినల్‌ అనేది సస్పెన్స్‌. ప్రతీపాత్రమీద అనుమానం వచ్చేలా చేస్తూ చివరిలో విప్పిన ముడి బాగుంది. గుడ్డిపాత్ర అయినా భవిష్యత్‌ తెలిసిన పాత్రలో ఢిల్లీ రాజేశ్వరి నప్పింది. పాటపరంగా టైంపాస్‌గా మధ్యలో వచ్చే 'పాప్‌ కార్న్‌' ఆటవిడుపుగా వుంది. రష్మీతోపాటు ఆమె స్నేహితురాలిగా చేసిన ఆమె బాగా నటించింది. పరిమిత బడ్జెట్‌తోనే ఆకట్టుకునేలా తీయడం ఈ చిత్రం ప్రత్యేకత. టైంపాస్‌ మూవీస్‌ చూడొచ్చు.