1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By డీవీ
Last Updated : గురువారం, 11 ఏప్రియల్ 2024 (13:44 IST)

వినోదంతో కాస్త భయాన్ని కలిగించేలా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ - రివ్యూ

anjali,sunil, srinivasreddy
anjali,sunil, srinivasreddy
నటి అంజలి 'గీతాంజలి' ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం "గీతాంజలి మళ్లీ వచ్చింది" చిత్రం మీద అందరి దృష్టి పడింది. శ్రీనివాస్ రెడ్డి, సత్య, సునీల్, షకలక శంకర్, రావురమేష్, అలీ తదితరులు నటించిన ఈ చిత్రాన్ని శివ తుర్లపాటి దర్శతక్వంలో MVV సినిమాస్‌తో కలిసి కోన ఫిల్మ్స్ కార్పొరేషన్‌పై కోన వెంకట్ నిర్మించారు. హారర్‌ కామెడీ జోనర్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందిన 'గీతాంజలి మళ్లీ వచ్చింది' చిత్రాన్ని  నేడు అనగా ఏప్రిల్ 11న విడుదల చేశారు. అదెలా వుందో తెలుసుకుందాం.
 
geetanjali sean
geetanjali sean
కథ:
శ్రీెనివాస రెడ్డి, సత్యం రాజేష్, సత్య, షకలక శంకర్ సినిమారంగంలో స్థిరపడాలని ప్రయత్నాలు చేస్తుంటారు. అందులో సత్య హీరోగా చేయాలనేది డ్రీమ్. సిటీలో వున్న వారికి ఊటీలో వున్న ఓ వ్యాపారవేత్త సినిమా తీయడానికి వీరిని తమ వద్దకు రప్పిస్తారు. వారి కథ విన్నాక అంతకంటే తన దగ్గర మంచి హార్రర్ సినిమా కథ వుందని తన కథతో సినిమా తీయడానికి కమిట్ చేయిస్తాడు. అందుకు ఊటీలో కొన్న పురాతన భవనంలో షూటింగ్ చేయిస్తాడు. 
 
geetanjali sean
geetanjali sean
ఆ క్రమంలో కొన్ని అనుకోని సంఘటనలు, గతంలో ఆ భవంతిలో వుండి చనిపోయిన ముగ్గురు దెయ్యాలు వీరి షూటింగ్ కు సహకరించారా? లేదా? ఆ తర్వాత ఏమయింది? అసలు ఊటీకే షూటింగ్ కు శ్రీనివాస్ రెడ్డి బ్యాచ్ ఎందదుకు వెళ్లాల్సి వచ్చింది. అసలు అంజలి పాత్ర ఏమిటి? అనేది మిగిలిన సినిమా.
 
geetanjali sean
geetanjali sean
సమీక్ష: 
గీతాంజలి సినిమాలో రావురమేష్ చనిపోవడంతో కథ ముగుస్తుంంది. ఆ తర్వాత అతని వారసుడు వారితో సినిమా తీయడానికి ఏవిధంగా ముందుకు వచ్చాడనేది లింక్ చేస్తూ కథను కోన వెంకట్ రాసుకున్నాడు. కానీ అక్కడ ముగ్గురు దెయ్యాల రూపంలో వున్నారనడం, వారిని మెథడ్ యాక్టర్స్ గా క్రియేట్ చేసి వారిచేత తమ షూటింగ్ ను జరుపుకోవడం బాగుంది. ఆదిశలో ట్విస్ట్ అనేది ముందే తెలిసిపోవడంతో ప్రేక్షకులకు పెద్దగా ఉత్సుకత కలిగించలేకపోయింది. అందుకే ఈ సినిమాకు డివైడ్ టాక్ వచ్చింది.
 
geetanjali sean
geetanjali sean
గీతాంజలి సినిమాలో విలన్ రావురమేష్ అని చివరివరకు తెలీకుండా జాగ్రత్త పడ్డాడు. కానీ ఇందులో ముందుగానే అసలు విలన్ ఎవరనేది చెప్పడం, బూత్ బంగ్లాలో దెయ్యాలు వున్నాయని చెప్పేయడంతో ట్విస్ట్ రిలీవ్ చేసి సస్పెన్స్ లేకుండా చేశాడు. 
 
geetanjali team
geetanjali team
దెయ్యాలు వున్నాయని తెలిసి వారిని జూనియర్ ఆర్టిస్టులుగా భావించమని శ్రీనివాస్ రెడ్డి చెప్పడం, దానికి అనుగుణంగా సునీల్, షకలకశంకర్, సత్య, అంజలి పాత్రలతో వచ్చే సన్నివేశాలు ఎంటర్ టైన్ చేయిస్తాయి. 
 
కథానుగుణంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. కోన వెంకట్ సంభాషణలు నాచురల్ గా వున్నాయి. నిర్మాణ విలువలు ఓకే. పతాకసన్నివేశాల్లో వచ్చే రావురమేష్, అతని కొడుకు, అంజలి చేసే యాక్షన్ ఎపిసోడ్ కొత్తగా వుంది. దీనికి విజువల్ ఎఫెక్ట్స్ బాగా తోడయ్యాయి. ఇక అలీ చేసే వెంట్రియాలిజమ్ ఎపిసోడ్ పిల్లలను బాగా అలరించేలా చేస్తుంది. అంజలి చేసే డాన్స్ బాగుంది. 
 
చాలా సరదాగా సాగిపోయేలా కథను దర్శకుడు తెరకెక్కించాడు. ఇది పిల్లలను, పెద్దలను కూడా అలరించే ప్రయత్నం చేసేలా కోన వెంకట్ మలిచాడు. రంజాన్ కు విడుదలైన ఈ సినిమా ఎంత మేర విజయం సాధిస్తుందో చూడాలి.
 రేటింగ్: 2.75/5