శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By Selvi
Last Updated : శుక్రవారం, 14 జులై 2017 (13:48 IST)

పటేల్ సర్ రివ్యూ రిపోర్ట్-రివేంజ్ డ్రామా: జగపతి బాబు వన్ మేన్ షో.. నటన అదుర్స్

సింథటిక్ డ్రగ్‌‌ను దేశంలోని యువత మొత్తానికి అలవాటు చేయాలని దేవరాజ్ అలియాస్ డీఆర్ (కబీర్ దుహాన్ సింగ్) భావిస్తాడు. ఈ డ్రగ్‌ను డీఆర్ తమ్ముడు కన్నా.. తయారు చేస్తాడు. ఈ డ్రగ్‌ను అమ్మడం కోసం దేవరాజ్ తన ఫ్ర

సినిమా పేరు : పటేల్ సర్
తారాగణం : జగపతిబాబు, పద్మప్రియా, తాన్య హోపే, సుబ్బరాజు, కబీర్ దుహన్ సింగ్, ఆమని తదితరులు
జానర్ : రివేంజ్ డ్రామా
దర్శకత్వం : వాసు పరిమి
నిర్మాత : సాయి కొర్రపాటి
విడుదల తేదీ : జూలై 14 
 
జగ్గూభాయ్ మరోసారి హీరోయిజాన్ని తెరపై చూపెట్టారు. విలన్, క్యారెక్టర్ ఆర్టిస్‌గా నటిస్తూ వచ్చిన జగపతి బాబు.. రెగ్యులర్ కమర్షియల్ ఫార్ములా సినిమాలను పక్కనబెట్టి.. వయసుకు తగిన రివేంజ్ డ్రామాలో నటించారు. ఈ సినిమా రివ్యూ రిపోర్ట్ ఎలా వుందో చూద్దాం. 
 
కథలోకి వెళితే: 
సింథటిక్ డ్రగ్‌‌ను దేశంలోని యువత మొత్తానికి అలవాటు చేయాలని దేవరాజ్ అలియాస్ డీఆర్ (కబీర్ దుహాన్ సింగ్) భావిస్తాడు. ఈ డ్రగ్‌ను డీఆర్ తమ్ముడు కన్నా.. తయారు చేస్తాడు. ఈ డ్రగ్‌ను అమ్మడం కోసం దేవరాజ్ తన ఫ్రెండ్స్ మౌంటీ(పృథ్వీ), ఛోర్ బజార్ లాలా( కాలకేయ ప్రభాకర్)లతో కలిసి భారీ స్కెచ్ వేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న జర్నలిస్ట్ రవి ఎలాగైన డీఆర్ గ్యాంగ్‌ను పట్టించాలని సాక్ష్యాధారాలు రెడీ చేస్తాడు. ఇంతలోనే రవిని దేవరాజ్ చంపేస్తాడు. రవి మరణానికి తర్వాత డీఆర్ గ్యాంగ్ లోని చోర్ బజార్ లాలాను పటేల్ సర్(జగపతి బాబు) రాక్షసంగా మట్టుబెడతాడు. 
 
ఇలా పటేల్ సర్ డీఆర్ గ్యాంగ్‌లకు చెందిన వారిని హత్య చేస్తూ వస్తాడు. ఆపై హత్యల వెనుక ఉన్నది ఎవరో తెలుసుకోవాలని డీఆర్ ప్లాన్ చేస్తాడు. మినిస్టర్ పాపారావు(రఘుబాబు) సాయంతో లంచాలకు అలవాటు పడ్డ పోలీస్ ఆఫీసర్ కేథరిన్(తాన్యా హోపే)ను ఇన్వస్టిగేషన్ ఆఫీసర్‌గా అపాయింట్ చేయిస్తాడు.

పోలీస్ ఇన్వస్టిగేషన్ జరుగుతుండగానే డీఆర్ తమ్ముడితో సహా మౌంటి కూడా పటేల్ సర్ చేతిలో హత్యకు గురవుతారు. అసలు పటేల్ సర్ ఈ హత్యలు ఎందుకు చేస్తున్నాడు..? పటేల్‌తో పాటు ఉన్న చిన్న పాప యామిని (బేబీ డాలీ) ఎవరు..? కేథరిన్ పటేల్ సర్‌ను అరెస్ట్ చేసిందా అనేది తెలియాలంటే.. సినిమా చూడాల్సిందే.
 
విశ్లేషణ: 
సినిమా అంతా జగపతిబాబు చుట్టూ తిరిగింది. జగపతిబాబు నటన ఆకట్టుకుంది. లుక్స్ పరంగా జగపతి బాబు సూపర్బ్ అనిపించాడు. విలన్‌గా, కబీర్ దుహన్ సింగ్ మరోసారి మెప్పించాడు. చాలాకాలం తరువాత తెలుగు తెర మీద కనిపించిన ఆమని, పద్మప్రియ, పృథ్వీలు తమ పాత్రలకు న్యాయం చేశారు.

బాహుబలి కామెడీతో ఆకట్టుకున్న సుబ్బరాజు.. ఈ సినిమాలోనూ అదే తరహా పాత్రలో కనిపించాడు. ఇతర పాత్రల్లో కాలకేయ ప్రభాకర్, శుభలేఖ సుధాకర్, పోసాని కృష్ణ మురళీ ఆకట్టుకున్నారు. దర్శకత్వం ఆశించిన స్థాయిలో లేదు. డీజే వసంత్ సంగీతం బాగుంది. నిర్మాణ విలువలు వారాహి చలనచిత్రం బ్యానర్ స్థాయికి తగ్గట్టుగా లేవు.
 
ప్లస్ పాయింట్స్ :
జగపతిబాబు నటన
క్లైమాక్స్ ట్విస్ట్స్
ఇంటర్వెల్ ట్విస్ట్
 
మైనస్ పాయింట్స్ :
పూర్ టేకింగ్.
పాయింట్స్ : 3