మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 7 ఫిబ్రవరి 2020 (10:38 IST)

డిఫరెంట్ లుక్‌తో 'వరల్డ్ ఫేమస్ లవర్' - నలుగురు హీరోయిన్లతో రొమాన్స్

world famous lover still
టాలీవుడ్ సంచలన యువ హీరో విజయ్ దేవరకొండ తాజా చిత్రం 'వరల్డ్ ఫేమస్ లవర్'. ఈ చిత్రాన్ని ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈనెల 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. ఇందులో హీరో విజయ్ డిఫరెంట్ లుక్‌తో కనిపిస్తున్నాడు. అలాగే, నలుగురు హీరోయిన్లతో రొమాన్స్ చేస్తున్నాడు. ఈ చిత్రం కోసం సినీ అభిమానులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. 
 
క్రాంతిమాధవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో విజయ్ దేవరకొండ సరసన రాశీఖన్నా, కేథరిన్, ఐశ్వర్య రాజేశ్, ఇజబెల్లె లైట్ కథానాయికలుగా నటించారు. ఆ నలుగురు కథానాయికలతో ఆయన సాగించిన జర్నీకి సంబంధించిన విజువల్స్‌పై ఈ ట్రైలర్‌ను కట్ చేశారు. 
 
లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ సీన్స్‌పై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. డిఫరెంట్ లు‌ తో విజయ్ దేవరకొండ చూపించిన వేరియేషన్ బాగుంది. ముఖ్యంగా నలుగురు హీరోయిన్లతో విజయ్ దేవరకొండ ప్రేమలో పడటంతో వారితో హాట్ హాట్ శృంగార సన్నివేశాలు, గాఢ చుంభనాల్లో మునిగితేలవడం వంటివి ఇట్టే ఆకట్టుకుంటున్నాయి. ఈ ట్రైలర్‌ను ఇప్పటికే 35 లక్షలమంది నెటిజన్లు వీక్షించడం గమనార్హం.