శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సినీ ఆవకాయ్
Written By pyr
Last Updated : మంగళవారం, 19 మే 2015 (13:18 IST)

నయనతార.. దర్శకుడు విఘ్నేష్ శివన్‌ను పెళ్ళి చేసుకుందోచ్...?

ప్రముఖ నటి నయనతార పెళ్ళిపై కోలివుడ్ మరోమారు కోడై కూసింది. ఆమె ఓ ఆలయంలో దర్శకుడు విఘ్నేష్ శివన్‌ని పెళ్ళి చేసుకున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. కాదు కాదంటూనే ఆ ఇద్దరు కూడా తాము మంచి స్నేహితులమని చెబుతున్నారు. హీరో శింబు, కొరియోగ్రాఫర్ ప్రభుదేవాలతో ప్రేమాయణాన్ని పెళ్ళి దాకా తీసుకువచ్చి విడిపోయిన సంఘటనలు నయనతారకు ఉన్నాయి. ప్రస్తుతం తమిళ దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌ని రహస్యంగా వివాహం చేసుకుందనే వార్త సోమవారం కోలీవుడ్‌ అంతటా షికారు చేసింది. 
 
గతంలో ప్రభుదేవాను వివాహం చేసుకోవటానికి నయనతార తన మతాన్ని కూడా మార్చుకుంది. ఇక వీరిరువురి పెళ్లి జరగటం ఖాయమనుకున్న సమయంలో ఊహించని విధంగా విడిపోయారు. అప్పటినుండి నయనతార నటనపై దృష్టిసారించారు. అయితే ప్రస్తుతం యువదర్శకుడు విగ్నేష్‌ శివన్‌తో నయనతారకు సన్నిహితపరిచయం ఏర్పడిందనే ఊహాగానాలు మొదలయ్యాయి. విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వం వహిస్తున్న ‘నానుం రౌడిదాన్‌’ అనే చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. . 
 
నయనతార కంటే వయసులో ఏడాది చిన్నవాడైన విఘ్నేష్‌ శివన్‌ తన ప్రేమ కానుకగా ఓ విలాసవంతమైన కారును ఆమెకు బహూకరించినట్లు కూడా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కొచ్చిన్‌లోని దేవాలయంలో నయనతార, విఘ్నేష్‌ శివన్‌ వివాహం జరిగిందని వార్తలు వినిపించాయి. అయితే తాను తమిళ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాననీ,, ఎవరినీ రహస్యంగా వివాహం చేసుకోలేదని, పెళ్లి నిశ్చయమైతే తప్పకుండా ప్రకటిస్తానని చెప్పింది. దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌ కూడా నయనతార తనకు మంచి స్నేహితురాలనీ, ఆమెతో పెళ్లి వార్త నిజం కాదనీ పేర్కొన్నారు