Webdunia - Bharat's app for daily news and videos

Install App

#BiharElectionResults : తొలి దశ ట్రెండ్స్.. మహాకూటమి 25 - ఎన్డీయే 14

Written By ఠాగూర్
Updated: మంగళవారం, 10 నవంబరు 2020 (09:00 IST)
దేశమంతా అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మంగళవారం ఉదయం ప్రారంభమైంది. ఉదయం 8 గంటల తర్వాత తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కించిన సిబ్బంది, ఆపై ఈవీఎంలను తెరిచారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, ఎన్డీయే 14 స్థానాల్లో ముందంజలో ఉండగా, మహా ఘటబంధన్ (మహా కూటమి) 25 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
 
ప్రస్తుత సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీ (యూ), బీజేపీ కలిసి ఓ కూటమిగా, తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ - కాంగ్రెస్ మరో కూటమిగా ఎన్నికల్లో పోటీ పడిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలు హోరాహోరీగా సాగాయని, కాస్తంత మొగ్గు మహా ఘటబంధన్ వైపే ఉందని పలు ఎగ్జిట్ పోల్స్ సూచించాయి. అందుకు అనుగుణంగానే ఫలితాల తొలి ట్రెండ్స్ కనిపిస్తున్నాయి.
 
బీహార్ రాష్ట్ర శాసనసభకు మూడు దశల్లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 38 జిల్లాల్లో ఏర్పాటు చేసిన 55 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. బీహార్‌లోని 243 అసెంబ్లీ స్థానాలకు మూడు విడతల్లో ఇటీవల ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. 
 
బీహార్‌ ముఖ్యమంత్రి పీఠం యువనేత తేజస్వీ యాదవ్‌కు దక్కుతుందా? లేక ప్రస్తుత సీఎం, అధికార జేడీయూ-బీజేపీ కూటమి నేత నితీశ్‌ కుమార్‌(69)కే మళ్లీ సొంతమవుతుందా? అనే ఉత్కంఠకు మరికొద్దిసేపట్లో తెరపడనుంది. నితీశ్‌ వయసులో సగం కంటే తక్కువగా ఉన్న ఆర్జేడీ యువ నేత తేజస్వీయాదవ్‌(31) నేతృత్వంలోని మహాఘట్‌ బంధన్‌కు అధికారం ఖాయమని మెజారిటీ ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేసిన నేపథ్యంలో ఈ ఫలితాలు సర్వత్రా ఉత్కంఠ రేపుతున్నాయి. 
 
రాష్ట్రంలోని 243 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్‌ 28వ తేదీ మొదలుకొని నవంబర్‌ 7వ తేదీ వరకు మూడు దశల్లో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అలాగే, బీహార్‌లోని వాల్మీకినగర్‌ లోక్‌సభ స్థానంతోపాటు మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలోని 28 స్థానాలు, ఇతర 10 రాష్ట్రాల్లోని 30 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు కూడా నేడు వెల్లడి కానున్నాయి.

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments