గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : గురువారం, 23 మార్చి 2023 (22:49 IST)

లాలూ కుమారుడికి కలలో కృష్ణుడి విశ్వరూపం దర్శనం.. ఆడుకుంటున్న నెటిజన్లు (Video)

Tej Pratap Yadav
Tej Pratap Yadav
బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు, మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ ఈరోజు తెల్లవారుజామున ట్విట్టర్‌లో ఓ వీడియో పోస్ట్ చేశారు. అందులో శ్రీకృష్ణుడు నిద్రిస్తున్న సమయంలో తనకు కలలో కనిపించి విశ్వరూప దర్శనం ఇచ్చాడని ట్వీట్ చేశాడు. 
 
ఈ వీడియోలో, తేజ్ ప్రతాప్ యాదవ్ మొదట నిద్రిస్తున్నట్లున్నారు. అప్పుడు అతను కలలు కంటున్నట్లుగా కంటి రెప్పను కదిలించడం కనిపిస్తుంది.

ఆ తర్వాత మహాభారతం సీరియల్ లాగా యుద్ధరంగంలో గుర్రాలు ప్రత్యక్షమవుతాయి. అలాగే శ్రీకృష్ణుని విశ్వరూప దర్శనం కనిపిస్తుంది. వెంటనే తేజ్ ప్రతాప్ యాదవ్ నిద్ర నుండి లేచి మంచం మీద కూర్చున్నట్లు వుంది. 
 
తేజ్ ప్రతాప్ యాదవ్ మహాభారతం సీరియల్ సన్నివేశాలను ఎడిట్ చేసి విశ్వరూపాన్ని కలలో చూసినట్లు వీడియోగా విడుదల చేశారు. ఈ వీడియో వైరల్ అవుతోంది. వీడియో చూసిన చాలామంది నెటిజన్లు తేజ్ ప్రతాప్‌పై సెటైర్లు విసురుతూ కామెంట్లు పెడుతున్నారు.