సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : మంగళవారం, 30 జులై 2019 (10:01 IST)

కాఫీ కింగ్ ఎక్కడ? కఫే కాఫీ డే ఫౌండర్ అదృశ్యం...

కఫే కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ కనిపించడం లేదు. కర్నాటక రాష్ట్రంలోని మంగుళూరులో ఆయన కనిపించడం లేదని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈయన బీజేపీ సీనియర్ నేత, కర్నాటక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ అల్లుడు కావడం గమనార్హం. సిద్ధార్థ సోమవారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. 
 
కాగా, దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కఫే కాఫీ డే ఔట్‌లెట్స్ మంచి ఆదరణ పొందిన విషయం తెల్సిందే. ఈ సెంటర్ల ద్వారా అనేక మంది ఉపాధి పొందుతున్నారు. అలాగే, ఈ ఔట్‌లెట్లలో సరఫరా చేసే ఆహా పదార్థాలు ఎంతో నాణ్యతతో కూడుకున్నవిగా గుర్తింపువుంది. అలాంటి కఫే కాఫీ డే వ్యవస్థాపకులుగా ఉన్న సిద్ధార్థ ఎందుకు కనిపించకుండా పోయారన్నది ఇపుడు పెద్ద మిస్టరీగా మారింది.