మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఎం
Last Updated : గురువారం, 6 మే 2021 (17:31 IST)

కోవిడ్ వస్తే ఆసుపత్రిలో వద్దు, ఇంట్లోనే చనిపోండి అంటూ అంగన్‌వాడి టీచర్ ఆవేదన

శ్రీకాకుళం చెందిన ఒక ఆమె తన తల్లికి బాగోలేదని మా ఊర్లో హాస్పిటల్ చూపించగా కోవిడ్ వచ్చింది టెక్కలి ఆస్పత్రిలో జాయిన్ చెయ్యండి అని చెప్పగా ఆమె 108కి ఫోను చేసింది. ఐతే గంట వరకు రాకపోవడంతో ఆమె వేరే వాహనంలో టెక్కలి గవర్నమెంట్ హాస్పిటలకి తీసుకెళ్ళింది.

అక్కడ సిబ్బంది ఆ బాధితురాలిని ఎవరూ పట్టించుకోలేదు. ఆమె కూతురు అవస్థలు పడి హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. అక్కడ నుండి ఆట మొదలైంది. టెక్కలి హాస్పిటల్ సిబ్బంది మీ అమ్మగారికి బాగోలేదు జెమ్స్ హాస్పిటల్‌కి పంపిస్తున్నాం అని చెప్పగా కూతురు నేను దూరంగా ఉన్నా వస్తున్నాము అని చెప్పగా మీరు వచ్చేదాకా మేము ఆగలేమని అనడంతో ఆ కూతురు అక్కడ జాయిన్ చేయండి మేము వచ్చేస్తున్నాం అని చెప్పింది.

ఆమె కూతురు ఉదయం ఆ తల్లి యోగక్షేమాల కోసం సెల్ఫోన్ ఇచ్చింది. హాస్పిటల్‌లో ఒక వ్యక్తి ద్వారా ఆ వ్యక్తి ఆ పేషెంట్ చేతికి ఉన్న ఉంగరాన్ని తెచ్చి ఆమెకు అందించాడు. ఇంకా ఆమె మెడలో మూడు తులాల పైనే ఒంటిపై ఉందని అది కూడా తెచ్చి ఇవ్వమని ఆ కూతురు కోరింది. అతను అలా తెచ్చి ఇవ్వడం కుదరదు అక్కడ సిసి కెమెరాలు ఉన్నాయి. మేము ఏదో చేసామని అనుకుంటారు. మీ అమ్మగారి బంగారానికి ఏమి భయం లేదు అని చెప్పాడు.

ఈ లోపల రాత్రికి ఆ కూతురు అక్కడ ఉండడానికి వీలు కుదరక ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటి నుండి కూతురు తల్లికి ఫోన్ చేయగా నా మెడలో బంగారం తాడు ఎవరో తీసివేశారు అని ఆమె తెలిపింది. కూతురు కొద్ది సమయం పోయాక తల్లికి ఫోన్ చేయగా ఫోన్ పలకలేదు. ఆ ఫోన్ స్విచాఫ్ అయింది. ఎవరైనా తస్కరించారో తెలియదు.
ఆమెకు అనుమానం కలిగి ఇంతకుముందు ఇచ్చిన వాళ్ల అమ్మగారి ఉంగరం తెచ్చి ఇచ్చిన వ్యక్తికి వాళ్లు ఫోన్ చేయడంతో మీ అమ్మగారు చనిపోయారు మీరు రండి అని చెప్పడం జరిగింది. హాస్పిటల్ సిబ్బంది రమ్మంటేనే మీరు వెళ్ళండి అని ఆ వ్యక్తి చెప్పాడు. సాయంత్రం వరకు ఏ కబురు చెప్పలేదు. హాస్పిటల్ సిబ్బంది మీ అమ్మగారు బ్రతికే ఉన్నారు ఆహారం తీసుకురండి అని చెప్పారు.

దీంతో కూతురుకి అనుమానం వచ్చి పాత వ్యక్తికి ఫోన్ చేసి మా అమ్మగారు బతికే ఉన్నారు అని హాస్పటల్ సిబ్బంది చెప్తున్నారు మీరు మాకు సహాయం చేయండి అని వేడుకోగా వాళ్ల అమ్మగారి  బాడీని అప్పగించడం జరిగింది. వారు చేయవలసిన దహన కార్యక్రమాలు అన్నీ జరిగిపోయాయి. కానీ హాస్పిటల్ వాళ్ళు ఇంకా మా అమ్మ బతికే ఉన్నారని ఇప్పటికీ చెబుతున్నారు.

ఇది ఒక గవర్నమెంట్ హాస్పిటల్ తీరు. వీరూ ఎంత మనోవేదన గురయ్యారు అర్థం అవుతుంది. ఇది ఈ ఒక్క హాస్పిటల్ కాదు రాష్ట్రంలోని పలు హాస్పిటల్స్ వ్యవస్థలు ఏవి బాగోలేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా ఆగమేఘాలమీద హాస్పిటల్ పైన నిఘా పెట్టి వాటిని అన్నిటిని ఒక సక్రమమైన మార్గంలో పెట్టి బాధిత ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.