బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 4 జనవరి 2022 (13:56 IST)

ఫ్రాన్స్‌లో కొత్తగా బి.1.640.2 వేరియంట్.. ఒమిక్రాన్‌ను తలదన్నేలా...

కరోనా వైరస్ ఏ ముహుర్తాన 2019 డిసెంబరులో వెలుగు చూసిందో అప్పటి నుంచి ప్రపంచం వైరస్ భయం గుప్పెట్లో జీవిస్తోంది. చైనాలో కరోనా వైరస్ వెలుగుచూసింది. దీని నుంచి డెల్టా వైరస్, డెల్టా ప్లస్ వైరస్‌లు పుట్టుకొచ్చాయి. ఆ తర్వాత దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ వైరస్ వెలుగుచూసింది. ప్రస్తుతం ఈ వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. 
 
ఈ క్రమంలో ఫ్రాన్స్‌లో మరో కొత్త వైరస్ పుట్టుకొచ్చింది. ఇది ఒమిక్రాన్‌ను తలదన్నేలా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ కొత్త వేరియంట్‌కు బి.1.640.2గా నామకరణం చేశారు. కామెరూన్ నుంచి వచ్చిన వారి ద్వారా ఈ వేరియంట్ ఫ్రాన్స్‌ దేశంలోని ప్రవేశించినట్టు గుర్తించారు. ఇప్పటికే పలువురు ఈ వేరియంట్ బారినపడినట్టు ఆ దేశ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. 
 
ఒమిక్రాన్ కంటే డేంజర్ అని అయితే, ప్రస్తుతం ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తుండటంతో ప్రపంచం దానిపైనే దృష్టిసారించి ఉందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఒకవేళ ఈ కొత్త వేరియంట్ వ్యాప్తి మొదలైతే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.