బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Modified: శుక్రవారం, 29 మార్చి 2019 (19:28 IST)

నీకు బ్రెయిన్ వుందా... కె.ఎ పాల్ ప్రశ్న: ఎవడ్రా నువ్వంటూ పాల్ కోడలు...

ఏపీ ఎన్నికలవేళ ప్రధాన పార్టీల నాయకుల సంగతేమోగానీ ప్రజాశాంతి పార్టీ చీఫ్ కె.ఎ పాల్ మాత్రం మూడు మీటింగులు ఆరు మీడియా సమావేశాలతో ఆవిధంగా ముందుకు పోతున్నారు. తాజాగా ఆయన ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి అత్యధికంగా 50 ఛానళ్లు వచ్చాయి. ఒకరిని మించి ఇంకొకరు ఆయనను ప్రశ్నలడగటంలో పోటీపడ్డారు. 
 
ఈ క్రమంలో ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు... ఇప్పటికే నువ్వు మూడుసార్లు ప్రశ్నలడిగావు. మిగిలినవారికి కూడా అవకాశం ఇవ్వాలి అంటూ మరో విలేకరి వైపుకి దృష్టి సారించారు. ఇంతలో ప్రశ్న అడిగిని విలేకరి... నా ప్రశ్నకు జవాబు చెప్పడంలేదు కదా... ఇక నా మైకు తీసుకుని నే వెళతా అంటూ పెట్టిన మైకును లాగేశాడు. దీనితో పాల్‌కి కోపం వచ్చింది.
 
నీకసలు బ్రెయిన్ వుందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇంతమంది వచ్చినప్పుడు నీకొక్కడికే ఎలా సమాధానాలు చెప్పేది. మిగిలినవారిని కూడా కవర్ చేయాలి కదా అనేసరికి అతడికి మరింత కోపం వచ్చింది. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సమయంలో ప్రక్కనే వున్న పాల్ కోడలు.. ఎవడ్రా నువ్వంటూ ఎవరినో గొణగటం వినిపించింది. మరి ఆమె ఎవర్ని ఆ మాట అన్నదో సస్పెన్సుగా మారింది.