ఫాస్ట్ పుడ్స్‌ను తీసుకుంటే.. అలర్జీలు తప్పవా?
ఫాస్ట్ పుడ్స్‌ను తీసుకుంటే.. ఆరోగ్యానికి ఇబ్బందులు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిజ్జాలు, బర్గర్లు తీసుకుంటే.. ఒబిసిటీ, మధుమేహంతో పాటు మెదడుకు ఇబ్బందులు తప్పవని వారు చెప్తున్నారు. ఫాస్ట్ ఫుడ్స్ తీసుకుంటే మెదడు ఆలోచన స్థాయిపై కూడా ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పరిమితికి మంచి ఫ్యాటీ ఆహారాన్ని తీసుకుంటే మెదడు ఆలోచన స్థాయి నిలకడ తప్పుతుందని.. వారు చెప్తున్నారు.
ఫాస్ట్‌పుడ్ తినే వారి మానసిక ప్రవర్తనలో విపరీతమైన మార్పులు సంభవించే అవకాశం వుందని పరిశోధకులు తెలిపారు. కొవ్వు పదార్థాలు అతిగా తీసుకుంటే.. నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతున్నట్లు పరిశోధనలో తేలింది. జీర్ణాశయం నుంచి మెదడుకు వెళ్లే సమాచార వ్యవస్థలో కొవ్వు కారణంగా అనేక మార్పులు చోటుచేసుకుంటున్నట్లు తెలిసింది.
అందుకే రోడ్డుకు పక్కన అమ్మే ఫాస్ట్ పుడ్స్ జోలికి వెళ్లకూడదని, ఎగ్ ఫ్రైడ్ రైస్, నూడిల్స్, ఎర్రగా కాలిన చికెన్ ముక్కలను టేస్టు చేయకూడదని.. హోటళ్లలో ఎక్కువ కాలం ఫ్రిజ్‌లో నిల్వ వుంచే చికెన్ ముక్కలను తినకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. హోటల్, ఫాస్ట్ ఫుడ్స్‌లో కలిపే వెనిగర్, మసాలాలు అలెర్జీలకు కారణమవుతాయని వైద్యులు చెప్తున్నారు.