మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 23 డిశెంబరు 2019 (13:27 IST)

జార్ఖండ్ అసెంబ్లీ ఫలితాలు : సీఎంగా హేమంత్ సొరేన్... తేజస్వి యాదవ్

జార్ఖండ్ అసెంబ్లీ ఫలితాలు : జార్ఖండ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం చేపట్టారు. ఈ ఫలితాల్లో కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ కూటమి విజయభేరీ మోగించింది. మొత్తం 81 అసెంబ్లీ సీట్లకుగాను ప్రభుత్వ ఏర్పాటుకు 42 సీట్లు కావాల్సివుంది. అయితే, యూపీఏ కూటమి 43 సీట్లలో ఆధిక్యంల కొనసాగుతుంది. 
 
అలాగే, బీజేపీ 28, ఏజేఎస్ యూ 4, జేవీఎం 3, ఇతరులు నాలుగు స్థానాల్లో ముందంజలో ఉన్నారు. 2014 ఎన్నికల ఫలితాలను చూస్తే బీజేపీ 42, జేఎంఎం 19, జేవీఎం 8, కాంగ్రెస్ 6, ఇతరులు 6 స్థానాల్లో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో ఫలితాలు తారుమారయ్యాయి. ఫలితంగా బీజేపీ అధికారాన్ని కోల్పోగా, కాంగ్రెస్ కూటమి అధికారంలోకిరానుంది. 
 
ఈ ఎన్నికల ఫలితాలపై ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ స్పందించారు. జార్ఖండ్ శాసనసభ ఎన్నికల్లో మహాఘట బంధన్ అత్యధిక స్థానాల్లో విజయం దిశగా దూసుకెళ్తుందని చెప్పారు. జేఎంఎం అధ్యక్షుడు హేమంత్ సోరేన్ జార్ఖండ్ సీఎంగా బాధ్యతలు చేపడుతారన్నారు. హేమంత్ సోరేన్ నాయకత్వంలో ఈ ఎన్నికల్లో పోటీ చేశామన్నారు. దుమ్కా నియోజకవర్గంలో హేమంత్ సోరెన్ ముందంజలో ఉన్నారు.