శనివారం, 5 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : బుధవారం, 27 సెప్టెంబరు 2023 (10:13 IST)

ఏపీలో కాంతారా గెటప్‌లో గణేష్ విగ్రహం.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

Kantara Ganesh
వినాయక చవితి గణేష్ ఉత్సవ్‌కు భారతదేశంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. గణేష్ చతుర్థిని పురస్కరించుకుని వివిధ రూపాల్లో గణేశుడి భారీ బొమ్మలు ప్రతిష్టించడం ఆనవాయితీ. అలా ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలోని గణేష్ పండల్‌లో ప్రతిష్టించిన విగ్రహాలలో ఓ వినాయకుడిని విగ్రహం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఇది వైరల్ కావడానికి కాంతారా థీమ్ బాగా వర్కౌట్ అయ్యింది. 
 
ఇందులో స్పెషల్ ఏంటంటే.. కాంతారా భూత రూపంలో వినాయకుడిని తయారు చేశారు. ఇలా కాంతారా రూపంలో, కాంతారా థీమ్‌లో వున్న విఘ్నేశ్వరుడు ఫోటోలు, వీడియోలు నెట్టింటిని షేక్ చేస్తున్నాయి. కన్నడ చిత్రం కాంతారా గిరిజన సమూహాల సాంప్రదాయ ఆచారాలను కళ్లకు కట్టినట్లు చూపెట్టింది. ఇది కర్నాటక తీర ప్రాంతాలలో మాయా 'భూత కోల' కళారూపంకు సంబంధించిన విశేషాలను సినీ ప్రేక్షకులకు, ప్రజలకు చూపెట్టింది. 
 
ఈ చిత్రాన్ని రిషబ్ శెట్టి తెరకెక్కించారు. ఈ సినిమాలో ఆయనే కాంతారాగా నటించారు. ఈ సినిమా నుంచి స్ఫూర్తి పొంది.. బుద్దప్ప నగర్‌లోని గణేష్ పండల్‌లో భూత కోలా కళాకారుడిని పోలిన గణపతి విగ్రహాన్ని రూపొందించారు. 
 
ఈ వినాయకుడిని చూసిన నెటిజన్లు కాంతారా గణేష్ విగ్రహాన్ని రూపొందించడంపై కొనియాడారు. అలాగే, పండల్ నుండి విజువల్స్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెటిజన్లు లైక్స్, షేర్స్, ఎమోజీలతో హోరెత్తిస్తున్నారు.