బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 26 సెప్టెంబరు 2023 (22:41 IST)

రోడ్డుపై వర్షపు నీటిలో కరెంట్.. బాలుడిని కాపాడిన వృద్ధ హీరో.. (వీడియో వైరల్)

Boy
Boy
రోడ్డుపై విద్యుదాఘాతానికి గురై నీటిలో పడిపోయిన నాలుగే ఏళ్ల చిన్నారిని ఇద్దరు వృద్ధులు కాపాడారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న సమయంలో ఆ బాలుడిని వృద్ధులు కాపాడిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 
 
వర్షపు నీరు రోడ్డుపై నిలవడం.. అందులో కాస్త కరెంట్ వైర్లు తెగి పడటంతో ఒక నిమిషానికి పైగా, పిల్లవాడు కరెంట్ షాక్‌తో నరకయాతన అనుభవించాడు. చాలామంది ఆ బాలుడిని కాపాడేందుకు ప్రయత్నించారు. వారు విద్యుత్ షాక్‌లను ఎదుర్కొన్నారు. ఆ సమయంలో ఒక తెలివైన, ధైర్యమైన వృద్ధ వ్యక్తి హీరోగా మారిపోయాడు. 
 
వారణాసిలోని చేత్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హబీబ్‌పురా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ నాటకీయ సంఘటన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ వీడియో మేకింగ్‌లో రికార్డ్ చేయబడింది. 
 
ఫుటేజీలో పిల్లవాడు కరెంట్ కలిసిన నీటిలో పడ్డాడు. అతను పైకి లేవడానికి నిరంతర ప్రయత్నాలు చేసినప్పటికీ, అతను పదేపదే ప్రమాదకరమైన నీటిలోకి జారిపోయాడు. ఈ గందరగోళ పరిస్థితిలో వృద్ధులలో ఒకరు రోడ్డుపై ట్రాఫిక్‌ను ఆపగలిగారు.
 
మరొకరు చిన్నారిని కాపాడేందుకు విశ్వప్రయత్నాలు చేసారు. దాదాపు నిముషం శ్రమించిన తర్వాత, ఒక వృద్ధుడు సమీపంలోని ఒక చెక్క కర్రను గమనించాడు. ఆ చెక్క సాయంతో.. పిల్లాడిని కరెంట్ కలిసిన నీటి నుంచి ఒడ్డుకు చేర్చి కాపాడాడు. దీంతో అక్కడున్న వారంతా  హమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చుకున్నారు. 
 
విశేషమేమిటంటే, కరెంట్ షాక్ బాధలో ఉన్న పిల్లవాడు పరిస్థితిని గ్రహించి, కర్రను గట్టిగా పట్టుకున్నాడు. పిల్లవాడు కర్రను సురక్షితంగా పట్టుకోవడంతో, అతను ప్రమాదకరమైన ఘట్టం నుంచి తనను తాను రక్షించుకోగలిగాడు.
 
రోడ్డుపై విద్యుదాఘాతానికి గురై నీటిలో పడిపోయిన నాలుగే ఏళ్ల చిన్నారిని ఇద్దరు వృద్ధులు కాపాడారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న సమయంలో ఆ బాలుడిని వృద్ధులు కాపాడిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 
 
వర్షపు నీరు రోడ్డుపై నిలవడం.. అందులో కాస్త కరెంట్ వైర్లు తెగి పడటంతో ఒక నిమిషానికి పైగా, పిల్లవాడు కరెంట్ షాక్‌తో నరకయాతన అనుభవించాడు. చాలామంది ఆ బాలుడిని కాపాడేందుకు ప్రయత్నించారు. వారు విద్యుత్ షాక్‌లను ఎదుర్కొన్నారు. ఆ సమయంలో ఒక తెలివైన, ధైర్యమైన వృద్ధ వ్యక్తి హీరోగా మారిపోయాడు. 
 
వారణాసిలోని చేత్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హబీబ్‌పురా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ నాటకీయ సంఘటన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ వీడియో మేకింగ్‌లో రికార్డ్ చేయబడింది. 
 
ఫుటేజీలో పిల్లవాడు కరెంట్ కలిసిన నీటిలో పడ్డాడు. అతను పైకి లేవడానికి నిరంతర ప్రయత్నాలు చేసినప్పటికీ, అతను పదేపదే ప్రమాదకరమైన నీటిలోకి జారిపోయాడు. ఈ గందరగోళ పరిస్థితిలో వృద్ధులలో ఒకరు రోడ్డుపై ట్రాఫిక్‌ను ఆపగలిగారు.
 
మరొకరు చిన్నారిని కాపాడేందుకు విశ్వప్రయత్నాలు చేసారు. దాదాపు నిముషం శ్రమించిన తర్వాత, ఒక వృద్ధుడు సమీపంలోని ఒక చెక్క కర్రను గమనించాడు. ఆ చెక్క సాయంతో.. పిల్లాడిని కరెంట్ కలిసిన నీటి నుంచి ఒడ్డుకు చేర్చి కాపాడాడు. దీంతో అక్కడున్న వారంతా  హమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చుకున్నారు. 
 
విశేషమేమిటంటే, కరెంచ్ షాక్ బాధలో ఉన్న పిల్లవాడు పరిస్థితిని గ్రహించి, కర్రను గట్టిగా పట్టుకున్నాడు. పిల్లవాడు కర్రను సురక్షితంగా పట్టుకోవడంతో, అతను ప్రమాదకరమైన ఘట్టం నుంచి తనను తాను రక్షించుకోగలిగాడు.