బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 8 మే 2021 (09:58 IST)

మీకు వెన్నెముక వుందనుకున్నాను, సిగ్గుచేటు జగన్? ఎవరు?

ప్రధానమంత్రిపై జార్ఖండ్ సీఎం చేసిన వ్యాఖ్యలను సీఎం జగన్ మోహన్ రెడ్డి ఖండించారు. బహిరంగంగా ప్రధానిపై విమర్శలు చేయవద్దనీ, అలా చేస్తే మన దేశానికి అది మంచిది కాదనీ, ఏవైనా అంతర్గత సమస్యలుంటే నేరుగా మాట్లాడాలే తప్ప ఇలా ట్విట్టర్ ద్వారా చేయకూడదని అని ట్వీట్ చేసారు.
 
దీనిపై తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ అఫీషియల్ అంటూ ఓ ట్విట్టర్ ఖాతాలో సీఎం జగన్ పైన ఎడాపెడా దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు '' నేను మీకు కొంత వెన్నెముక ఉంటుందని అనుకున్నాను. కానీ మీరు పూర్తిగా కోల్పోయారు. బిజెపి ఐటి సెల్ మీ ఐడిని నిర్వహిస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు. ఏమి పతనం. సిగ్గుచేటు మిస్టర్ జగన్'' అని ట్వీట్ చేసారు.
 
మరో ట్వీటులో... జగన్ మోహన్ రెడ్డి అమ్ముడుపోయిన మనిషి అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఐతే ఈ ఫేక్ ఖాతాను ఎవరు హ్యాండిల్ చేస్తున్నారన్నది తేలాల్సి వుంది. తన పేరు పైన సోషల్ మీడియాలో ఇలా ఖాతా ఏర్పాటు కావడం, కామెంట్లు చేయడంపై శశికళ దృష్టి పెట్టినట్లు లేరనుకుంటా.