సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : బుధవారం, 16 డిశెంబరు 2020 (22:45 IST)

2 వేల అడుగుల ఎత్తు నుంచి కిందపడిన ఐఫోన్.. చిన్న గీతలే..!

iPhone 6s
స్మార్ట్‌ఫోన్‌ చేతిలో ఉంటే చాలు గంటల తరబడి దానిలోనే లీనమైపోతున్నారు చాలామంది. స్మార్ట్ ఫోన్ మన జీవితంలో భాగమైపోయింది. అలాంటి స్మార్ట్ ఫోనుకు స్క్రాచ్ పడినా తట్టుకోలేం. అలాంటిది రెండు వేల అడుగుల ఎత్తు నుంచి ఐఫోన్ పడిపోయింది. అంతే ఐఫోన్ ఓనర్‌కి షాక్ తప్పలేదు.

కానీ 2వేల అడుగుల ఎత్తు నుంచి ఐఫోన్ కింద పడినా చిన్న డ్యామేజ్ కూడా కాలేదు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 2 వేల అడుగుల ఎత్తు నుంచి జారి పడిన తన ఐఫోన్ ఖచ్చితంగా పగిలిపోయిందని అనుకున్నాడు. 
 
కానీ అసలు దానికి ఏమీ కాకపోయే సరికి ఊపిరిపీల్చుకున్నాడు. ఈ అరుదైన ఘటన బ్రెజిల్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బ్రెజిల్‌లోని రియో డి జెనెరియోకు చెందిన ఎర్నెస్టో గాలియోట్టో అనే వ్యక్తి 2 వేల అడుగుల ఎత్తులో ఓ విమానం నుంచి డాక్యుమెంటరీ తీస్తున్నాడు. అదే సమయంలో తన ఐఫోన్ 6 ఎస్ ద్వారా విమానం కిటికీలోంచి వీడియో తీస్తున్నాడు. అయితే, బలంగా వీచిన గాలికి అతని చేతుల్లో ఉన్న ఐఫోన్ 6ఎస్ 2 వేల అడుగుల ఎత్తు నుంచి కిందపడిపోయింది. దీంతో తన ఫోన్ తుక్కుగా పగిలి పోయి ఉంటుందని అతను భావించాడు. 
 
కానీ ఆశ్చర్యకరంగా ఆ ఫోన్‌కు ఏమీ అవ్వకపోవడంతో ఊపిరిపీల్చుకున్నాడు. అంతేకాక, ఆ ఐఫోన్ అంత ఎత్తు నుంచి కింద పడినప్పటికీ దానిలోని కెమెరా రికార్డింగ్‌ మాత్రం అలాగే కొనసాగుతుండటం విశేషం. కాగా, విమానం నుంచి ఫోన్ కింద పడిపోగానే ఎర్నస్టో గాలియోట్టో 'ఫైండ్ మై ఐఫోన్' యాప్‌ను ఉపయోగించి అది పడిపోయిన ప్రదేశాన్ని గుర్తించాడు. 2 వేల అడుగుల నుంచి కింద పడిన ఐఫోన్‌కు చిన్న గీతలు పడ్డాయి, అంతకుమించి చిన్న పగులు కూడా ఏర్పడలేదు.