ganesh chaturthi

మోడీకి ప్లస్.. చంద్రబాబుకి మైనస్.. ఏంటి?

Written By జె
Updated: సోమవారం, 11 ఫిబ్రవరి 2019 (20:33 IST)
మోడీ - చంద్రబాబులకు మధ్య జరుగుతున్న మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ప్రధానమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఏకంగా ఎపి సిఎం చంద్రబాబునాయుడును టార్గెట్ చేస్తూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. అది కూడా చంద్రబాబు తన వారసుడిని రాజకీయంగా నిలబెట్టాలని పాకులాడుతున్నారని, లోకేష్‌‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో చంద్రబాబునాయుడు కూడా అదేస్థాయిలో మోడీకి సమాధానం కూడా ఇచ్చారు.
 
కానీ చంద్రబాబు మాట్లాడిన తీరు విశ్లేషకులనే ఆశ్చర్యపరుస్తోంది. రాజకీయంగా తన కుటుంబాన్ని సుస్థిరం చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని మోడీ చెప్పారు కానీ బాబు మాత్రం ఏకంగా మోడీ కుటుంబ సభ్యులనే టార్గెట్ చేశారు. తల్లిని, భార్యను పట్టించుకోని మోడీ కూడా నా గురించి మాట్లాడుతారా. భార్యకు విడాకులు కూడా ఇవ్వకుండా వదిలేసిన వ్యక్తి మోడీ అంటూ ధ్వజమెత్తారు చంద్రబాబు. తెలుగుదేశం పార్టీ అధినేత ఈ విధంగా మాట్లాడటం దేశ రాజకీయాల్లో చర్చ నీయాంశంగా మారింది. 
 
ఎందుకంటే ఒక దేశానికి ప్రధానికి ఉన్న వ్యక్తిపై ఇంతటి వ్యాఖ్యలు చేయడం సరికాదంటున్నారు విశ్లేషకులు. ప్రధానమంత్రి మోడీని చంద్రబాబు నాయుడు తిట్టడం వల్ల మోడీకే లాభం తప్ప బాబుకు ఏ మాత్రం లాభం ఉండదంటున్నారు. నిన్న జరిగిన ఎపిసోడ్ చూస్తుంటే మోడీకి ప్లస్ గాను, చంద్రబాబుకు మైనస్ గాను మారిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

అన్నీ చూడండి

ఎపిక్..ఐదేళ్ల తర్వాత రావాల్సిన సినిమా అంటున్నారు : ఆనంద్ దేవరకొండ

మంగళసూత్ర మహిళలే ఎందుకు ధరించాలి... పురుషులకు లేని నిబంధనలు స్త్రీలకే ఎందుకు? నటి నమిత ప్రశ్న

Keerthy Suresh: డోరతీ ప్రీమియర్ లో కీర్తి సురేష్‌కు ఘనస్వాగతం పలికిన టొరంటో

Samyuktha: పూరిజగన్నాధ్, రామ్ పోతినేని చిత్రాల్లో నటిస్తూ పుట్టినరోజు చేసుకున్న సంయుక్త మీనన్

Naga Chaitanya: ఫౌజీ తో తలపడుతున్న నాగ చైతన్య వృషకర్మ చిత్రం

తర్వాతి కథనం
Show comments