శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 23 డిశెంబరు 2019 (11:07 IST)

విశాఖను ఇక ఆ దేవుడే రక్షించాలి : కేశినేని నాని

విశాఖపట్టణాన్ని ఇక ఆ దేవుడే రక్షించాలని తెలుగుదేశం పార్టీకి చెందిన విజయవాడ ఎంపీ కేశినేని నాని అభిప్రాయపడ్డారు. విశాఖను కార్యనిర్వాహక రాజధాని చేయనున్నట్టు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ఇటీవల ప్రకటించారు. దీనిపై రాజధాని అమరావతి ప్రాంతానికి చెందిన 29 గ్రామాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 
 
ఇదే అంశంపై కేశినేని నాని స్పందిస్తూ, "పాకిస్థాన్ నుండి విశాఖను రక్షించేందుకు భారత దేశ సైన్యం వుంది. కాని విశాఖకు అసలు ముప్పు ప్రస్తుతం మన జగన్నన అండ్ గ్యాంగ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచే. వీళ్ళ నుండి విశాఖను దేవుడే రక్షించాలి" అని విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యానించారు. 
 
ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టారు. ఓ దినపత్రికలో "విశాఖపై పాకిస్థాన్ కన్నెందుకు?" అంటూ ప్రచురితమైన ఓ కథనాన్ని ఉంచారు. పాకిస్థాన్ నుంచి విశాఖకు ముప్పేమీ లేదని చెబుతూ, అసలు ముప్పు వైసీపీ నుంచేనని విమర్శించారు.