శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : మంగళవారం, 12 జూన్ 2018 (10:32 IST)

కిమ్మా.. మజాకా... టాయ్‌లెట్‌ను వెంటతెచ్చుకున్న ఉత్తర కొరియాధినేత

ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్.. ఏ పని చేసినా అది వార్తలకెక్కాల్సిందే. సింగపూర్ వేదికగా జరిగిన ట్రంప్-కిమ్ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సదస్సులో పాల్గొనేందుకు ఒక రోజు ముందుగానే సింగపూర్‌కు ఆయన వచ్

ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్.. ఏ పని చేసినా అది వార్తలకెక్కాల్సిందే. సింగపూర్ వేదికగా జరిగిన ట్రంప్-కిమ్ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సదస్సులో పాల్గొనేందుకు ఒక రోజు ముందుగానే సింగపూర్‌కు ఆయన వచ్చారు.
 
సింగపూర్‌లోని ఓ నక్షత్ర రిసార్ట్సులో అమెరికా - ఉత్తర కొరియా దేశాధినేతల మధ్య ఈ చారిత్రాత్మక చర్చలు జరిగాయి. ఇందులో డోనాల్డ్ ట్రంప్, కిమ్ జాంగ్ ఉన్‌లతో పాటు ఇరు దేశాధినేతలు పాల్గొన్నారు. ఇంతవరకు బాగానే ఉంది. 
 
కానీ, సింగపూర్‌కు వచ్చిన కిమ్ వెంట ఓ మొబైల్ టాయ్‌లెట్ కూడా వచ్చింది. దాన్ని కిమ్‌ కోసం ప్రత్యేకంగా తయారు చేయడం జరిగింది. ఈ మొబైల్ టాయ్‌లెట్‌ను వెంట తెప్పించుకోవడానికి గల కారణాలపై దక్షిణ కొరియా పత్రికలు ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించాయి. 
 
ఈ మీడియా కథనాల మేరకు కిమ్‌ తన ఆరోగ్య రహస్యాలను పశ్చిమ దేశాలు కనిపెట్టకుండా ఉండేందుకే ఈ జాగ్రత్త తీసుకున్నారు. 'కిమ్‌ కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. స్థూలకాయుడైన ఆయనకు స్వతహాగా ఫాటీ లీవర్‌ ఉంది. మధుమేహం, అధిక రక్తపోటు, కీళ్ల వాతం కూడా ఉన్నాయి. 
 
తన మల, మూత్రాదులను పరీక్షించి పశ్చిమ దేశాలు తన ఆరోగ్య సమస్యను అంచనా వేస్తుందన్నది ఆయన భయం. దానికి తావు లేకుండా, ఎటువంటి పరీక్షలకు లొంగని రీతిలో విసర్జనను డిస్పోజ్‌ చేయగల అత్యాధునికమైన టాయ్‌లెట్‌ను తన కోసం ఆయన తయారు చేయించుకున్నారు' అని దక్షిణ కొరియా వార్తాపత్రిక ఓ కథనంలో పేర్కొంది. మొత్తంమీద కిమ్ కోసం భారీ విమానంతో పాటు.. ఓ మొబైల్ టాయ్‌లెట్ కూడా వచ్చింది.