శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By selvi
Last Updated : గురువారం, 12 ఏప్రియల్ 2018 (17:16 IST)

పీహెచ్‌డీ విద్యార్థిని ఆత్రేయి ఆచూకీ లభ్యం.. అంతా సోషల్ మీడియా ఎఫెక్ట్

సమాజంపై సోషల్ మీడియా ప్రభావం అంతా ఇంతా కాదు. తాజాగా సోషల్ మీడియా సాయం వల్ల ఇంటి నుంచి అదృశ్యమైన ఓ యువతి ఆచూకీని గుర్తించారు. ఏప్రిల్ 4న అదృశ్యమైన బెంగళూరుకు చెందిన పీహెచ్‌డీ విద్యార్థిని ఆత్రేయి మజుంద

సమాజంపై సోషల్ మీడియా ప్రభావం అంతా ఇంతా కాదు. తాజాగా సోషల్ మీడియా సాయం వల్ల ఇంటి నుంచి అదృశ్యమైన ఓ యువతి ఆచూకీని గుర్తించారు. ఏప్రిల్ 4న అదృశ్యమైన బెంగళూరుకు చెందిన పీహెచ్‌డీ విద్యార్థిని ఆత్రేయి మజుందర్(35) ఆచూకీ ఎట్టకేలకు లభ్యమైంది.

ఆత్రేయిని  బెంగళూరులోని హోటల్ తాజ్ వివంతలో ఆమె ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఉద్దేశపూర్వకంగానే మజుందర్ ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులు చెప్పారు.
 
ఏప్రిల్ 4న టొరంటో నుంచి భారత్‌కు వచ్చిన ఆమె అదే రోజు రాత్రి 9గంటల నుంచి కనిపించకుండాపోయింది. ఆమె ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారు. ఫొటోలను షేర్ చేసి ఎవరికైనా ఆమె కనిపిస్తే తెలియజేయాల్సిందిగా కోరారు. ఆమె ఆచూకీ తెలిస్తే సమాచారమందించాల్సిందిగా అందరినీ కోరారు. 
 
ఇంకా పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు.. ఆత్రేయి తల్లిదండ్రులు. ఈ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఆత్రేయి ఆచూకీని బుధవారం కనుగొన్నారు. ఇంటి నుంచి వెళ్లిపోయిన రోజు ఆమె బెంగళూరులోని నోవాటెల్ హోటల్‌లో బస చేసినట్లు విచారణలో తేలింది. ఆ తర్వాత బెంగళూరులోని మారియట్ హోటల్‌కు ఆమె చేరుకుంది. 
 
అక్కడ నుండి వివంతకు వెళ్లింది. సోషల్ మీడియాలో ఆమె ఫొటోలను చూసిన అక్కడి హోటల్ సిబ్బంది మజుందర్‌ను గుర్తించారు. పోలీసులకు సమాచారమందించారు. దీంతో ఆత్రేయి మజుందర్ అదృశ్యం వ్యవహారం సుఖాంతమైంది.