Daily Horoscope
✕

వావ్ యమ్మీ.. చికెన్ పచ్చడి ఇలా చేయండి.. రోజా రెసిపీ (వీడియో)

Written By సెల్వి
Updated: మంగళవారం, 21 ఏప్రియల్ 2020 (19:33 IST)
వైసీపీ ఎమ్మెల్యే, సినీ నటి రోజా ఎప్పుడూ రాజకీయాలు, షోలు అంటూ బిజీ బిజీగా గడుపుతుంటారు. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించిన కారణంగా ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితం అయ్యారు. ప్రస్తుతం రోజా కూడా ఇంట్లో వుంటూ హాయిగా వంటలు చేసుకుంటున్నారు. రోజూ వంటలు చేస్తూ యూ ట్యూబ్‌లో పెడుతుంది. అంతేకాదు తయారీ విధానం కూడా చెబుతుంది రోజా. 
 
మొన్నటికి మొన్న ఈమె చేసిన చికెన్ ఫ్రై చేస్తే నిర్మాత బండ్ల గణేష్ కూడా థ్యాంక్స్ చెప్పాడు. ఇక ఆ తర్వాత రోజు గుత్తి వంకాయ్ ఫ్రై ఎలా చేయాలో చూపించింది రోజా. మొన్న మళ్లీ కొత్త వంట.. మీ కోసమే రుచికరమైన బీట్‌రూట్ ఛట్నీ అంటూ వచ్చేసింది ఈ జబర్దస్త్ జడ్జి. ఆవకాయ్ పచ్చడి కూడా చేసి చూపించింది. 
 
ఇప్పుడు చికెన్ పచ్చడి అంటూ ముందుకు వచ్చింది. చికెన్ పచ్చడి ఎలా చేయాలని కూడా చెప్పింది. లాక్ డౌన్‌లో వుంటూ తన కుటుంబంతో హ్యాపీగా గడిపేస్తుంది రోజా. రోజా మాత్రమే కాదు.. ప్రస్తుతం తెలుగు సినిమా సెలబ్రిటీస్ అంతా పూర్తిగా వంటలతోనే బిజీ అయిపోయారు. వాళ్ల వాళ్ల వీడియోలు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇంకేముంది.. రోజా చికెన్ పచ్చడి ఎలా చేశారో.. ఈ వీడియో ద్వారా ఓ లుక్కేయండి. 
 

అన్నీ చూడండి

జయంత్ అండ్ ది జింగో పెన్ చిత్రం తారే జమీన్ పర్ లా సక్సెస్ అవ్వాలి

Bigg Boss Trigun: బిగ్ బాస్ ఫేమ్ త్రిగుణ్.. రా అండ్ రస్టిక్‌గా జంగా ఫస్ట్ లుక్

Dheeraj Mogilineni: జయసుధ, వాసుకి పాత్రలు మా అమ్మను గుర్తచేశాయి : ధీరజ్ మొగిలినేని

విడాకులు ఇచ్చిన భార్యను మళ్లీ ప్రేమించి వివాహం చేసుకున్న బాలీవుడ్ దర్శకుడు

Sai Rajesh : సాయి రాజేష్ మైనా తో మిట్టి & మూన్ ఫిల్మ్స్‌ను ప్రారంభించారు

తర్వాతి కథనం
Show comments