యాలకుల టీ సేవిస్తే.. ఏమౌతుందో తెలుసా? (video)

Elachi Tea
సెల్వి| Last Updated: సోమవారం, 20 ఏప్రియల్ 2020 (19:35 IST)
Elachi Tea
ఆఫీసులో గంటల పాటు కూర్చుంటున్నారా? లేదా వర్క ఫ్రమ్ హోమ్ చేస్తూ.. మీటింగులు అంటూ బిజీ బిజీగా వున్నారా..? కాసేపు అలా పనుల్ని పక్కనబెట్టి యాలకుల టీ కప్పు తాగండి.. అంతే టెన్షన్ పూర్తిగా తగ్గిపోతుంది. యాలకుల టీ సేవిస్తే.. ఒత్తిడి మాయం అవుతుంది. మానసిక ఒత్తిడి అస్సలుండదు. రక్తపోటు తగ్గుతుంది.

రక్తపోటు ఇబ్బంది వుంటే.. యాలకుల టీని సేవించడం మంచి ఉపశమనం లభిస్తుంది. ఈ టీని సేవించడం ద్వారా ఊపిరితిత్తులకు రక్త ప్రసరణ మెరుగు అవుతుంది. తలనొప్పి తగ్గుతుంది. అజీర్తి సమస్యలుంటే.. యాలకుల టీని రోజుకు రెండు కప్పులు తీసుకోవడం మంచిది.

కడుపు ఉబ్బరం తగ్గాలంటే.. యాలకుల టీని రోజూ ఓ కప్పు అయినా తీసుకోవాలి. యాలకుల టీని కప్పు మేర రోజూ తీసుకుంటే హృద్రోగ సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. ఇంకా వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవచ్చునని న్యూట్రీషియన్లు చెప్తున్నారు.
దీనిపై మరింత చదవండి :