వైరస్‌కు చెక్ పెట్టే.. కరివేపాకు కషాయం.. ఎలా చేయాలంటే? (video)
కరివేపాకు పొడి వంద గ్రాములు, 25 గ్రాముల శొంఠి పొడి, కరక్కాయ పొడి 50 గ్రాములు తీసుకుని కలుపుకుని ఓ సీసాలో భద్రపరుచుకోవాలి. రోజూ అరస్పూన్ మేర ఈ పొడిని గ్లాసుడు వేడినీటిలో మరిగించి రోజూ రెండుపూటలా తీసుకుంటే.. రక్తశుద్ధికి ఉపకరిస్తుంది. శరీరానికి ఉత్తేజాన్నిస్తుంది.
అజీర్తిని దూరం చేసుకోవాలంటే.. వాత, పిత్త, కఫానికి సంబంధించిన రోగాలకు చెక్ పెట్టాలంటే.. కరివేపాకును తప్పకుండా ఆహారంలో భాగం చేసుకోవాలి. కరివేపాకును నేతిలో వేయించి అందులో రెండు మిరపకాయలు, చింతపండు నిమ్మ పండంత, ఉప్పు చేర్చి పచ్చడిలా తయారు చేసుకుంటే శరీరంలో రక్త ప్రసరణ మెరుగు అవుతుంది. వేవిళ్లు, అజీర్తిని ఇది నయం చేస్తుంది. కరివేపాకు పొడి, గోరింటాకును బాగా పేస్టులా రుబ్బుకుని తలకు పట్టిస్తే జుట్టు నెరవదు.
కరివేపాకు, శొంఠి, జీలకర్ర, ఉల్లి వంటి వాటిని సమపాళ్లలో తీసుకుని దోరగా వేయించి పొడి కొట్టుకుని, ఆ పొడిని రోజూ నేతితో వేడి అన్నంలో కలుపుకుని తింటే మలబద్ధకం వుండదు. కరివేపాకు పొడిని రోజూ రెండు స్పూన్ల మేర తీసుకుంటే దగ్గు, జలుబు మటాష్ అవుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
అలాగే మునగకాడలు, కరివేపాకు కాడలు, ఉసిరి కాడలు తలా ఒక్కో గుప్పెడు తీసుకుని, శొంఠి, మిరియాలు, జీలకర్ర 20 గ్రాముల మేర తీసుకుని.. వీటిని పొడి చేసుకుని కషాయంలా తీసుకుంటే.. వ్యాధి నిరోధక శక్తి పెరగడంతో పాటు.. వైరస్, బ్యాక్టీరియాకు సంబంధించిన రోగాలను దూరం చేసుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు సెలవిస్తున్నారు.