కమలా పండు ఆరోగ్య ప్రయోజనాలు
కమలాలను తీసుకుంటే రక్తపోటు అదుపులో వుంటుంది. గుండె జబ్బులను నిరోధిస్తుంది. క్యాన్సర్ బారిన పడకుండా కమలాలు కాపాడతాయి. నోరు, గొంతు, జీర్ణాశయ కేన్సర్లు, అల్జీమర్సు పార్కిన్సన్ వ్యాధులు, డయాబెటీస్, కాటరాక్ట్, కలరా, మూత్రాశయంలో రాళ్ళు, శ్వాసకోశ కేన్సర్‌ను నిరోధించే శక్తి కమలాలకు ఉంది.
కమలాలు రోజూ తింటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. రోజుకో పండు తింటే అల్సర్లు రావు. లంగ్ క్యాన్సర్లు రావు. కమలారసం కన్నా, పండు వలిచి తింటేనే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. కమలాపండ్లను డయాబెటిస్ వ్యాధి ఉన్న వారు నిరభ్యంతరంగా తినొచ్చు. మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడకుండా నిరోధించే శక్తి ఈ పళ్ళకుంది. 3-4 పళ్లు తింటే వయస్సుతో వచ్చే కంటి చూపు మందగించడం సమస్యను చాలా వరకు నిరోధించవచ్చును. కమలాలను రోజూ తినే వారిలో ఒబెసిటీ సమస్య ఉండదు. అధిక బరువున్న వారు రోజూ తీసుకుంటూ ఫలితం ఉంటుంది.
అంతేకాకుండా కమలారసం తాగడం వల్ల శరీర ఛాయ మెరుగుపడుతుంది. విటమిన్ సి చర్మాన్ని స్మూత్‌గా నిగారింపుగా వస్తుంది. కమలాల తొక్కలను ఎండబెట్టి సున్నిపిండిలో కలుపుకునే వాడితే మంచిది. ఎండలో ముఖం కమిలినట్లుగా ఉంటే కమలాల రసం ముఖానికి రాసి 20 నిమిషాల పాటు ఉంచి చల్లటి నీళ్ళలో కడుక్కుంటే తేటగా ఉంటుంది.