బుధవారం, 8 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 15 ఏప్రియల్ 2020 (22:42 IST)

నువ్వుల నూనెలో పసుపు రాసి అలా చేస్తే..

ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఐతే మన భారతీయ సంప్రదాయంలో పసుపుకి ఎంతో ప్రాధాన్యత వుంది. కనీసం ఏడు-ఎనిమిది వారాలకు ఒక సారైనా ఒంటికి పసుపు రాసుకొని స్నానం చేస్తే చర్మ సంబంధ వ్యాధులు రావు. క్రమేణా చర్మం మీద ఉండే అన్‌వాంటెడ్ హెయిర్‌ రాలిపోతుంది. ఈ కాలంలో అయితే నువ్వుల నూనెలో పసుపు కలిపి ఒంటికి పట్టించాలి.
 
1. కళ్ళకలక వచ్చినప్పుడు దూదిని ధనియాలు నానేసిన నీటిలో ముంచి కళ్ళను తుడిస్తే ఉపశమనంగా పనిచేస్తుంది. 
 
2. కళ్ళు మంటలు, కళ్ళవెంట నీరు కారడంలాంటి సమస్యలతో బాధపడేవారు తులసి ఆకుల రసాన్ని కంటి మీద రాసి చూడండి.
 
3. కాలిన మచ్చలకు తేనె రాస్తే కాలిన మచ్చలు పోతాయి.
 
4. కాళ్ళు చేతులు బెణికి నట్లయితే ఉప్పుతో కాపడం పెడితే తగ్గుతుంది.
 
5. కాస్త చింతపండు గుజ్జు, టమాటారసం, మిరియాల పొడి, ఒక మిరపకాయ, కాస్త ఉప్పులతో తయారు చేసిన సూప్‌ని వేడిగా తాగితే జలుబు, ముక్కు కారటం తగ్గుతాయి.
 
6. కాస్త దాల్చిన చెక్క పొడి, ఒక టేబుల్ స్పూను తేనె, కొంచెం మిరియాల పొడి, రెండు చుక్కల నిమ్మరసం ఇవన్నీ కలిపి తీసుకుంటే సాధారణ జలుబు తగ్గుతుంది.