శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : సోమవారం, 16 డిశెంబరు 2019 (14:45 IST)

ఉల్లిధరలు పెరగడంతో కోటీశ్వరుడైన రైతు.. ఎక్కడ?

ఉల్లిధరలు అమాంతం పెరిగిపోవడంతో దేశ ప్రజలు వాటిని కొనలేక నానా తంటాలు పడతున్నారు. అయితే కర్ణాటకకు చెందిన ఓ రైతు మాత్రం పెరిగిన ఉల్లిధరలతో కోటీశ్వురుడిగా మారిపోయాడు. వివరాల్లోకి వెళితే.. క‌ర్ణాట‌క‌కు చెందిన మ‌ల్లికార్జున్ ఎన్నో సంవ‌త్స‌రాల నుంచి ఉల్లిపాయ‌ల‌ను పండిస్తున్నాడు. కానీ ఎప్పుడూ న‌ష్టాలే వ‌చ్చేవి. 
 
కానీ ఈసారి మల్లికార్డున్ పండించిన 20 ఎకరాల్లో ఉల్లి పంటను సాగుచేశాడు. అయితే ఈ సారి మాత్రం ఉల్లి ధ‌ర ఎక్కువ‌గా ఉండ‌డంతో అత‌ని పంట పండింది. అత‌నికి అదృష్టం క‌లిసి వ‌చ్చింది. దీంతో అన‌తి కాలంలోనే అత‌నికి కోటి రూపాయల మేర లాభం వచ్చింది. ఇక పంట వేసేందుకు మాత్రం అత‌నికి రూ.15 ల‌క్ష‌ల నుంచి రూ.20 ల‌క్ష‌ల డ‌బ్బు ఖ‌ర్చ‌యింది.
 
కానీ లాభం మాత్రం కోటి రూపాయలు రావడంతో అతని ఆనందానికి అవధుల్లేవ్. ఈ సందర్భంగా మల్లికార్జున్ మాట్లాడుతూ.. డ‌బ్బులో కొంత డ‌బ్బును ఖ‌ర్చు పెట్టి మంచి ఇల్లు క‌ట్టించుకుంటాన‌ని తెలిపాడు. మిగిలిన డ‌బ్బుతో మ‌ళ్లీ వ్య‌వసాయం చేస్తాన‌ని చెబుతున్నాడు. అదృష్టం అంటే ఇలానే వుంటుంది మరి.