శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 13 డిశెంబరు 2019 (18:51 IST)

భార్య ట్వింకిల్ ఖన్నాకు అక్షయ్ ఉల్లి చెవి పోగులు.. ఫోటోలో వైరల్

బాలివుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తన భార్యకు ఉల్లిపాయ పోగులు ఇచ్చాడు. ప్రస్తుతం ఇదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

''కపిల్ శర్మ షో నుంచి తిరిగొచ్చిన నా భర్త.. వీటిని కరీనాకు చూపించారు. వీటిని ఆమె అంతగా ఇష్టపడినట్టు అనిపించలేదు.. కానీ నీకివి నచ్చుతాయని నాకు తెలుసు. అందుకే నీకోసం తెచ్చా" అంటూ అక్షయ్ తనతో వ్యాఖ్యానించినట్టు అతని భార్య ట్వింకిల్ ఖన్నా ట్విట్టర్‌లో పోస్ట్ చేసారు. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దేశంలో ఉల్లి ధరలు భారీగా పెరిగిపోతున్నాయి.
 
ఉల్లి కంటే బంగారమే నయం అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అక్షయ్ కుమార్ తన భార్యకు ఉల్లి చెవి పోగులు ఇవ్వడం.. ఆ ఫోటోలు కాస్త వైరల్ కావడం.. వీటిపై కామెంట్లు వెల్లువెత్తడం జరిగిపోయింది. 
 
 
ఉల్లి ధరలు పెరిగిపోతుండటంతో విదేశాల నుంచి ఉల్లిని దిగుమతి చేస్తున్నా సరే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. మహారాష్ట్రలో పడిన వర్షాలు దేశం మొత్తం చుక్కలు చూపిస్తున్నాయి. ఉల్లి కొరత దెబ్బకు ప్రభుత్వాలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే.