సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వాసు
Last Updated : సోమవారం, 3 జూన్ 2019 (18:15 IST)

లారెన్స్‌ని బుజ్జగించిన అక్షయ్..

రాఘవ లారెన్స్ హీరోగా చేసి తెలుగు తమిళ భాషలలో సంచలన హిట్ సాధించిన హార్రర్ సినిమా 'కాంచన'ను అక్షయ్ కుమార్ కథానాయకుడిగా 'లక్ష్మీ బాంబ్' పేరుతో హిందీలోకి రీమేక్ చేసేందుకుగానూ దర్శకుడిగా లారెన్స్ రంగంలోకి దిగాడు. అయితే ఇటీవల సదరు నిర్మాతలు దర్శకుడైన లారెన్స్ ప్రమేయం లేకుండానే ఈ సినిమాకి సంబంధించిన ఫస్టులుక్‌ను విడుదల చేయడంతో లారెన్స్ చాలా ఫీలవుతూ... దర్శకుడైన తనకి తెలియకుండా తన సినిమా నుంచి ఫస్టులుక్‌ని విడుదల చేయడం అంటే తనకి తగిన గౌరవం ఇవ్వలేదని భావిస్తూ సదరు ప్రాజెక్ట్ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించేశారు. 
 
దాంతో అయోమయంలో పడిన ఈ ప్రాజెక్టుకి సంబంధించి అక్షయ్ కుమార్ రంగంలోకి దిగి లారెన్స్‌ను బుజ్జగించడం జరిగిందట. ఆయన రిక్వెస్ట్ చేయడంతో లారెన్స్ తన పంతాన్ని పక్కకి పెట్టి... శనివారం రోజున సినిమా షూటింగుని ఆయన చేతుల మీదుగానే తిరిగి ప్రారంభించారట. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ అక్షయ్‌తో దిగిన ఫోటోను పోస్ట్ చేయడంతో, అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.