శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 3 జూన్ 2019 (17:58 IST)

ముఖ్యమంత్రిని ఇంటర్వ్యూ చేస్తూ ముక్కు మూసేసిన రిపోర్టర్

ముఖ్యమంత్రిని ఇంటర్వ్యూ చేస్తూ ఓ విలేకరి ముక్కు మూసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. జార్ఖండ్ సీఎం రఘువరదాస్‌ను రిపోర్టర్ నిధిశ్రీ ఇంటర్వ్యూ చేసింది. అయితే ముఖ్యమంత్రి రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చేలోపు ముక్కు మూసేసుకుంది. ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతూ వివాదానికి కారణమైంది. 
 
ఈ ఫోటోను జార్ఖండ్‌కు చెందిన ఓ యువకుడు ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. దీనిపై నిధి సోషల్ మీడియాలో వివరణ ఇచ్చింది. ఉన్నట్టుండి అలా ముక్కు మూసేసుకున్నానని.. కావాలని ముక్కు పట్టుకోలేదని చెప్పింది. ఏదో దుర్గంధం రావడంతో ముక్కు పట్టుకున్నానని వస్తున్న వార్తల్లో నిజం లేదని నిధి స్పష్టం చేసింది.