గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 10 మే 2019 (11:35 IST)

#SitaTrailer.. నా పేరు సీత నేను గీసిందే గీత.. ప్రాస బాగుంది కదా (వీడియో)

టాలీవుడ్ అగ్రహీరోయిన్ కాజల్‌ అగర్వాల్‌ టైటిల్‌ పాత్రలో నటించిన చిత్రం సీత. ఈ సినిమాకు తేజ దర్శకత్వం వహించారు. బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా నటిస్తున్నాడు. తాజాగా ఈ  సినిమా నుంచి ట్రైలర్ రిలీజైంది.


ఇందులో మన్నారా చోప్రా మరో కథానాయికగా నటించారు. అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందించారు. మే 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 
ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి తాజాగా విడుదలైన ట్రైలర్‌లో నా పేరు సీత నేను గీసిందే గీత. ప్రాస బాగుంది కదా అంటూ కాజల్ చెప్పే డైలాగ్ బాగుంది.
 

రావణాసురుడు సీతను ఎత్తుకెళ్లడం తప్పు కాదండి. రాముడి భార్యను ఎత్తుకెళ్లడం తప్పు అని ట్రైలర్‌ చివర్లో శ్రీనివాస్‌ చెబుతున్న డైలాగ్‌ హైలైట్‌గా నిలిచింది. ఇంకేముంది.. సీత ట్రైలర్‌ను ఓ లుక్కేయండి.