శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 26 ఆగస్టు 2019 (15:51 IST)

కాసుల వర్షం కురిపిస్తున్న మిషన్ మంగళ్ ...11 రోజుల్లో రూ.150 కోట్ల కలెక్షన్

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన తాజా చిత్రం మిషన్ మంగళ్. విద్యాబాలన్, సోనాక్షి సిన్హా, తాప్సీ, కృతి కుల్హరీ, నిత్యామీనన్‌లు హీరోయిన్లుగా నటించారు. ఈ నెల 15వ తేదీ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని విడుదలైంది. ఈ చిత్రం విడుదలైన తొలి ఆట నుంచి మంచి టాక్‌ తెచ్చుకుంది. ఫలితంగా కేవలం 11 రోజుల్లో రూ.150 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. 
 
ఈ విషయాన్ని సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్విట్టర్ ద్వారా తెలిపాడు. 11 రోజుల్లోనే రూ.150 కోట్లు కలెక్ట్ చేసిన అక్షయ్ రెండో సినిమాగా "మిషన్ మంగళ్" నిలిచింది. మొదటి సినిమా రజినీకాంత్‌తో చేసిన "2.0" చిత్రం 10 రోజుల్లోనే ఈ మార్క్ అందుకుంది. దేశ వ్యాప్తంగా ఈ చిత్రం ఇప్పటివరకు రూ.164 కోట్లు వసూలు చేసింది.