శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 23 జులై 2022 (22:11 IST)

Arpita Mukherjee: గది తలుపులు తెరిచి చూసి గుడ్లు తేలేసిన ED అధికారులు

Arpita Mukherjee
ఇప్పుడు దేశంలో మారుమోగుతున్న పేరు అర్పితా ముఖర్జీ(Arpita Mukherjee). ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లో వాణిజ్యం- పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న సీనియర్ తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు పార్థ ఛటర్జీ సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ నుండి ED అధికారులు రూ. 21 కోట్లు రికవరీ చేశారు. వెస్ట్ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ (డబ్ల్యుబిఎస్‌ఎస్‌సి), వెస్ట్ బెంగాల్ బోర్డ్ ఆఫ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ (డబ్ల్యుబిబిపిఇ) రిక్రూట్‌మెంట్ అవకతవకలపై కొనసాగుతున్న విచారణకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అర్పితా ముఖర్జీ నివాసంపై దాడులు నిర్వహించారు.

 
ఆమె నివాసాల్లోని గదుల్లో వున్న రూ.2000, రూ.500 కరెన్సీ నోట్ల కట్టలను చూసి అధికారులు గుడ్లు తేలేసారు. ఆమె నుంచి ఇప్పటివరకూ రూ. 21 కోట్ల నగదుతో పాటు, టోలీగంజ్‌లోని డైమండ్ సిటీ కాంప్లెక్స్‌లో ముఖర్జీ నివాసం నుండి 20 మొబైల్ ఫోన్‌లను కూడా ED అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మొబైల్ ఫోన్‌లు WBSSC, WBBPEలో ఉపాధ్యాయుల నియామక స్కామ్‌కు కీలకమైన లింక్‌లను అందిస్తాయని అధికారులు భావిస్తున్నారు. టీచర్ల రిక్రూట్‌మెంట్ స్కామ్‌కు సంబంధించి వివిధ చోట్ల సోదాలు నిర్వహిస్తున్నామని, ఈ సందర్భంగా భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నట్లు ED మీడియాలోని ఒక విభాగానికి ఒక ప్రకటన విడుదల చేసింది.