మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 7 మే 2024 (17:34 IST)

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

Modi
Modi
ప్రధాని మోదీ కుర్రాడిలా డ్యాన్స్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సేమ్ టు సేమ్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా హుషారుగా డ్యాన్స్ చేస్తున్న కార్టూన్ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో తన డ్యాన్స్ వీడియోపై స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. 
 
ఈ వీడియో చూసి మీరంతా ఎంజాయ్ చేసినట్లే ఆ డ్యాన్స్ చూసి తానూ ఎంజాయ్ చేసానని ప్రధాని అన్నారు. ఈ వీడియో చాలా సృజనాత్మకంగా వుందని ప్రధాని అన్నారు. ఎన్నికల హడావిడి సమయంలో ఇలాంటి వీడియోలు ఎంతో ఉపశమనంగా వుంటాయి. ఇలాంటివి తనకెంతో సంతోషాన్ని ఇస్తాయని కామెంట్స్ చేశారు. ఇలా తన డ్యాన్సింగ్ వీడియోను పోస్ట్ చేసిన నెటిజన్‌ను, క్రియేట‌ర్‌ను ప్రధాని ప్రశంసించారు.
 
అంతకుముందు ఈ వీడియోను పోస్ట్ చేయడం వల్ల డిక్టేటర్ (ప్రధాని) తనను అరెస్టు చేయబోరని తనకు తెలుసునంటూ ఆ వీడియోను తన పేజీలో పంచుకునే ముందు నెటిజన్ రాసుకొచ్చాడు. అయితే మోదీ ఈ వీడియోకు సానుకూలంగా స్పందించడం ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.