బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : బుధవారం, 4 ఆగస్టు 2021 (11:04 IST)

రోడ్డుపై ఊగుతూ, తూలుతూ పడుకుంది.. పోలీసులకు చుక్కలు

మెట్రోపాలిటన్ సిటీ అయిన పుణెలోని తిలక్ రోడ్డులో హిరాబాగ్ చౌక్ ఉంది. అది ఎప్పుడూ వాహనాల రాకపోకలతో రద్దీగా ఉంటుంది. సరిగ్గా ఆ స్పాట్‌లోకి ఎంటరైంది తాగుబోతు యువతి.
 
ఊగుతూ, తూలుతూ రాత్రివేళ రోడ్డు మధ్యలోకి వచ్చింది. వాహనదారులకు చుక్కలు కనిపించాయి. ఏమాత్రం జాగ్రత్తగా డ్రైవింగ్ చేయకపోయినా తమ వాహనం కింద ఆమె పడే ప్రమాదం ఉంది అని భావించి వాళ్లే జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లారు. 
 
కాసేపు రోడ్డుపై హంగామా చేసిన ఆ యువతి ఆ తర్వాత రోడ్డు మధ్యలో పడుకుంది. దాంతో ట్రాఫిక్‌కి అంతరాయం ఏర్పడింది. ఆమెను రోడ్డుపై నుంచి పక్కకు తీసుకెళ్దామని కొందరు ప్రయత్నించగా "నో నో.... నోనోనోనో" అంటూ హడావుడి చేసింది. 
 
లాభం లేదురా నాయనా అనుకుంటూ పోలీసులకు కాల్ చేశారు. కసంబాస్ పోలీసులు అక్కడికి వచ్చారు. వాళ్లకూ చుక్కలు చూపించింది. రోడ్డు పక్కకు తీసుకెళ్లబోతుంటే అర్థం కాని మాటలేవో మాట్లాడింది. పోలీసులకు చిర్రెత్తుకొచ్చింది. అరెస్టు చేసి స్టేషన్‌కి తీసుకెళ్లారు.