గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 31 జులై 2021 (11:00 IST)

ఫ్రీ బిర్యానీ తెచ్చిన తంటా.. మహిళా పోలీస్ అధికారిణికి తలనొప్పి.. ఏమైంది?

ఫ్రీ బిర్యానీ మహిళా పోలీస్ అధికారిణి చేసిన పని చివరకు ఆమెకు తలనొప్పి తెచ్చిపెట్టింది. ఉచితంగా బిర్యానీ కావాలని డిమాండ్ చేసినట్లు ప్రభుత్వ వర్గాలకు తెలియడం, దీనికి సంబంధించిన ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. దీంతో ఆ మహిళా పోలీస్ అధికారిణి స్పందించాల్సి వచ్చింది. 
 
ఇదంతా మార్ఫింగ్, తనను తొలగించాలనే ఉద్ధేశ్యంతో కొంతమంది ఇలా చేస్తున్నారంటూ చెప్పుకొచ్చింది. ఈ విషయం రాష్ట్ర హోం మంత్రి వరకు వెళ్లింది. దీనిపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. 
 
మహారాష్ట్రలో విశ్రాంబాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో దేశీ ఘీ రెస్టారెంట్ చాలా ఫేమస్. ఇందులో బిర్యానీకి ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఇక్కడ డిప్యూటీ కమిషనర్ ర్యాంకులో మహిళా ఐపీఎస్ అధికారిణిగా పనిచేస్తున్నారు.
 
ఏ రెస్టారెంట్‌లో మంచి బిర్యానీ దొరుకుతుందని ఆరా తీశారు. దేశీ ఘీ రెస్టారెంట్‌లో బిర్యానీ బాగా రుచిగా ఉంటుందని సబార్డినేట్ వెల్లడించారు. మటన్ బిర్యానీ తెప్పించాలని కోరింది. రెస్టారెంట్ వాళ్లు డబ్బులు అడిగితే.. స్థానిక పోలీస్ ఇన్స్‌స్పెక్టర్‌తో మాట్లాడించాలని చెప్పారు.
 
తాము ఎప్పుడూ బయటినుంచి ఆర్డర్ చేసినా.. డబ్బులు చెల్లిస్తుంటాం అని సబార్డినేట్ సమాధానం ఇచ్చారు. మా పరిధిలో ఉన్న రెస్టారెంట్‌కు కూడా డబ్బులు చెల్లించాలా ? అక్కడి ఇన్స్ పెక్టర్ చూసుకుంటాడని మహిళా అధికారిణి తెలిపారు.
 
అయితే..దీనికి సంబంధించిన ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో తెగ వైరల్‌గా మారింది. మహిళా అధికారిణిపై పలు విమర్శలు చెలరేగాయి. దీనిపై ఆ మహిళా అధికారిణి స్పందించారు. తన వాయిస్‌తో ఉన్న ఆడియో క్లిప్‌ను మార్ఫింగ్ చేశారని ఆరోపించారు.