గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 7 జూన్ 2021 (21:18 IST)

పుణెలో భారీ అగ్నిప్రమాదం.. 12మంది మృతి

Pune
మహారాష్ట్రలోని పుణెలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఘోటావాడె ఫటాలోని ఓ ప్రైవేటు రసాయనిక కంపెనీలో అగ్నిప్రమాదం చెలరేగడంతో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందినట్టు చెబుతున్నారు. మరో ఐదుగురి ఆచూకీ తెలియడం లేదు. 
 
విధి నిర్వహణలో 37 మంది ఉండగా, 20 మందిని కాపాడినట్టు అధికారులు చెబుతున్నారు. సమాచారం తెలిసిన వెంటనే 8 అగ్నిమాపక శకటాలు ప్రమాద స్థలికి చేరుకున్నాయి. మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాదానికి కారణాలు కానీ, ఆస్తి నష్టం ఏమేరకు జరిగి ఉండొచ్చనేది కానీ తెలియాల్సి ఉంది.