ముంబై హైవేపై పది అడుగుల కొండ చిలువ.. వీడియో వైరల్ (video)
దేశ వాణిజ్య నగరమైన ముంబై హైవేపై భారీ కొండచిలువ హల్‌చల్ చేసింది. హైవేపై కొండచిలువను చూసిన వాహనదారులు షాక్ తిన్నారు. దీంతో భారీ ట్రాఫిక్ ఏర్పడింది. వివరాల్లోకి వెళితే.. ముంబై చునాబట్టి సమీపంలోని తూర్పు ఎక్స్‌ప్రెస్ హైవేపై 10 అడుగుల కొండచిలువ వెళ్లడాన్ని వాహనదారులు గమనించారు. భారీ కొండచిలువ రోడ్డు దాటడాన్ని చూసేందుకు వాహనదారులు తమ వాహనాలను ఆపడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.
ఇక రోడ్డు దాటిన కొండచిలువ ఓ కారు టైర్‌కు చుట్టుకుంది. దీంతో ఆ కారును రోడ్డు పక్కకు పెట్టించి పోలీసు అధికారులు రెస్క్యూ సిబ్బందికి సమాచారమిచ్చారు. గంట తర్వాత రెస్క్యూ సిబ్బంది అక్కడకు వచ్చి కొండచిలువను రక్షించారు. కాగా.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంకా కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. లైకులు, షేర్లు పెరిగిపోతున్నాయి.