వస్తున్నాయ్.. వస్తున్నాయ్ రాఫెల్ యుద్ధ విమానాలు కాస్కోండి
ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన రాఫెల్ యుద్ధవిమానాలు భారత్ అమ్ముల పొదిలోకి రానున్నాయి. జూలై 29వ తేదీన బుధవారం భారత్ భూబాగం పైన అడుగుపెట్టబోతున్నాయి. ఈ విమానాలను భారత్‌కు తీసుకురావడానికి వాయుసేనకు చెందిన పైలెట్లు గతవారం ప్రాన్స్‌కు బయలుదేరి వెళ్లారు.
సోమవారం ఉదయం భారత్ కాలమాన ప్రకారం తెల్లవారు జామున 3 గంటలకు ఫ్రాన్స్‌లో ఇస్ట్రెస్ ఎయిర్‌బేస్ నుంచి 5 విమానాలు బయలుదేరాయి. ఈ వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ ఐదు యుద్ధ విమానాలూ హర్యానాలో గల అంబాలా ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో బుధవారం ల్యాండ్ అవుతాయి. మార్గంమధ్యలో ఇంధనం నింపుకోవడానికి య.ఎ.ఇలో ఆగుతాయి. అక్కడ నుంచి నేరుగా ఇండియా చేరుకుంటాయి.
ఈ యుద్ధ విమానాలను చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్ని నేపథ్యంలో లడఖ్ ప్రాంతంలో మోహరిస్తారు. ఈ స్థాయి యుద్ధ విమానాలు చైనా చేతిలో లేకపోవడం భారత్‌కు సానుకూల అంశం. కరోనా వైరస్ ఉన్నప్పటికీ రాఫెల్ యుద్ధ విమానాల్ని నిర్ణీత గడువులోగా పంపించాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కోరడంతో ఫ్రాన్స్ ప్రభుత్వం ముందుకొచ్చింది. ఫైటర్స్ జెట్స్‌ను నడపడానికి పైలెట్లకు ప్రత్యేక శిక్షణ ఇప్పించింది భారత వాయుసేన. 36 మంది పైలట్ల ఈ విమానాలు నడపడానికి తర్ఫీదు పొందారు.