హైదరాబాద్ నగరం విశాఖపట్టణం కంటే తీసిపోయిందా?
గురువారం నాడు కేంద్రం ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ నగరాల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో హైదరాబాద్ నగరానికి 24వ స్థానం దక్కింది. దీనిపై హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి తీవ్ర అసహనాన్ని వ్యక్తపరిచారు.
భారతదేశంలో అత్యంత నివాసయోగ్యమైన నగరాల్లో హైదరాబాద్ నగరానికి 24వ స్థానం అనేది హైదరాబాదీలు అంగీకరించరని ఆమె అన్నారు. మెట్రో నగరాల్లో హైదరాబాద్ ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతోందనీ, ముత్యాల నగరంగా పేరున్న ఈ సిటీకి 24వ ర్యాంక్ ఏంటని ప్రశ్నించారు. ఐతే మొన్నటి హైదరాబాద్ వరదలు నగర వాసులకు బీభత్సాన్ని చూపించాయి. అందువల్లనే నగరానికి ఆ ర్యాంక్ వచ్చి వుంటుందనే టాక్ వినిపిస్తోంది.
ఇదిలావుంటే ఈ ర్యాంకింగుల్లో 10 లక్షల మందికి పైగా వున్న నగరాల్లో బెంగళూరు మొదటి స్థానంలో వుండగా ఆ తర్వాత స్థానాల్లో పుణె, అహ్మదాబాద్, చెన్నై నగరాలు వున్నాయి. 13వ స్థానంలో ఢిల్లీ వుండగా 15వ స్థానంలో విశాఖపట్టణం వుంది. హైదరాబాద్ నగరానికి 24 స్థానం లభించింది.