శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 1 మే 2020 (16:05 IST)

ఐసీసీ ర్యాంకింగ్స్.. మూడో స్థానానికి పడిపోయిన భారత్.. కారణం?

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) విడుదల చేసిన తాజా టెస్టు ర్యాంకింగ్స్‌లో కోహ్లీ సేన అగ్రస్థానాన్ని కోల్పోయింది. ఇందుకు అత్యధికంగా టెస్టు సిరీస్‌లు ఆడకపోవడమే కారణం. తాజా ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియాకు 116 రేటింగ్ పాయింట్లతో మొదటి స్థానంలో, న్యూజిలాండ్ 115 పాయింట్లతో రెండవ స్థానంలో వుంది. ఇక టీమిండియా 114  పాయింట్లతో మూడవ స్థానంలోకి పడిపోయింది. 
 
అక్టోబర్ 2016 తరువాత భారతదేశం మొదటిసారిగా అగ్రస్థానంలో నిలిచింది. దీనికి కారణం భారతదేశం 12 టెస్టుల్లో గెలిచి, 2016-17లో కేవలం ఒక టెస్టులో ఓడిపోయింది. ఈ మధ్యలో భారత్ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌తో సహా మొత్తం ఐదు సిరీస్‌లను గెలుచుకుంది. 
 
మరోవైపు, ఆస్ట్రేలియా అదే సమయంలో దక్షిణాఫ్రికాతో పాటు భారత్‌తోనూ ఓడిపోయింది. భారత్ 2016 అక్టోబర్‌లో అగ్రస్థానాన్ని చేపట్టినప్పటి నుండి 42 నెలలు టెస్టుల్లో నెం-1గా నిలిచింది. అయితే ఇప్పుడు ఆ జైత్ర యాత్ర ముగిసింది.