శనివారం, 4 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 1 మే 2020 (10:39 IST)

భారత ఫుట్‌బాల్ మాజీ కెప్టెన్ మృతి- ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం తెచ్చిన?

chuni goswami
భారత ఫుట్‌బాల్ మాజీ కెప్టెన్ సుబిమల్ (చుని) గోస్వామి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన గురువారం ప్రాణాలు కోల్పోయారు. భారత్‌కు చెందిన ఫుట్‌బాల్ దిగ్గజాల్లో ఒకరిగా గోస్వామి పేరు తెచ్చుకున్నారు. ఆయన కెప్టెన్సీలో భారత ఫుట్‌బాల్ జట్టు ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం గెలుచుకుని చరిత్ర సృష్టించింది.
 
ఇక, గోస్వామి ఫుట్‌బాల్‌తో పాటు క్రికెట్‌లో కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. దేశవాళి క్రికెట్‌లో బెంగాల్‌కు ప్రాతినిథ్యం వహించారు. ఇక భారత ఫుట్‌బాల్ జట్టు తరఫున 50 మ్యాచులు ఆడిన సుబిమల్ మంచి ఆటగాడిగా పేరు తెచ్చుకున్నారు. సుబిమల్ గోస్వామి మృతిపై భారత ఫుట్‌బాల్ సమాఖ్య తీవ్ర విచారం వ్యక్తం చేసింది.