శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By శ్రీ
Last Updated : మంగళవారం, 5 నవంబరు 2019 (21:25 IST)

విజయా రెడ్డి హత్యపై నిరసన చేస్తున్న రెవిన్యూ సిబ్బందికి చేదు అనుభవం, విరుచుకుపడిన మహిళ(Video)

ఎమ్మార్వో విజయారెడ్డి దారుణ హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆమె హత్య హేయమైన చర్యగా నాయకులు, అధికారులు అన్నారు. ఆమె హత్యకు నిరసనగా ఇవాళ పలు ప్రాంతాల్లో నిరసన కార్యక్రమం చేపట్టారు తెలంగాణ ప్రాంత రెవిన్యూ సిబ్బంది.
 
ఐతే యాదాద్రి జిల్లాలో రెవిన్యూ సిబ్బందికి చేదు అనుభవం ఎదురైంది. విజయా రెడ్డి హత్యకు నిరసనగా గుండాల MRO కార్యాలయం ముందు రెవిన్యూ సిబ్బంది నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతున్నారు. ఆ సమయంలో అక్కడికి ఓ మహిళ వచ్చింది. తన వద్ద రూ. 2000 తీసుకున్న వీఆర్వో పాసు బుక్ ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనితో అక్కడ నిరసన చేస్తున్నవారంతా మెల్లగా లేచి వెళ్లిపోయారు.