మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 29 అక్టోబరు 2019 (11:25 IST)

#RIPsujith రెండేళ్ల బాలుడు.. బోరు బావిలో నాలుగు రోజులు.. చివరికి మృతి

రెండేళ్ల బాలుడు.. బోరు బావిలో.. నాలుగు రోజుల పాటు వుండి.. చివరికి ప్రాణాలు కోల్పోయాడు. తమిళనాడులో ఈ నెల 25న ఇంటి వద్ద ఆడుకుంటూ బోరుబావిలో పడ్డ రెండేళ్ల సుజిత్ విల్సన్ మృతి చెందాడు. నాలుగు రోజుల నుంచి బోరుబావిలో నరకం అనుభవించిన బాలుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని బాలుడి తల్లిదండ్రులు జీర్ణించుకోలేక కన్నీరుమున్నీరవుతున్నారు. 
 
బాలుడి మృతదేహాన్ని మనప్పరాయ్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తమిళనాడు ప్రజలు సుజిత్ కోసం చేసిన ప్రార్థనలన్నీ ఫలితం లేకపోయాయి. ఇక సుజిత్ మృతదేహాన్ని బోరుబావిలో నుంచి వెలికితీయడానికి మూడు రోజులుగా తీవ్ర ప్రయత్నాలు చేశారు. బాలుడిని రక్షించేందుకు ప్రయత్నించిన రెస్క్యూ టీం శాయశక్తులా ప్రయత్నించినా ప్రయత్నం లేకపోయింది.
 
బోరుబావిలో పడ్డ సుజిత్‌ను వెలికితీసే సమయానికి మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉంది. దీంతో రెస్క్యూ టీమ్ ఆపరేషన్‌ను నిలిపివేశారు. తీవ్ర ఉత్కంఠ రేపిన ఈ సంఘటన సంచలనం రేకెత్తించింది. దాదాపు 80 గంటల పాటు ఈ రెస్క్యూ ఆపరేషన్ జరిగింది. ఇలాంటి ఘటనలు ఎన్ని జరుగుతున్నా బోరు బావి తవ్వకాలు ఆగడం లేదు. తవ్విన బావులు నిరుపయోగం అయితే వాటిని పూడ్చకపోవడం కారణంగా ఇలాంటి దారుణమైన ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ప్రజలు మండిపడుతున్నారు.