మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : శుక్రవారం, 31 ఆగస్టు 2018 (13:24 IST)

కరిగిపోతున్న రూపాయి విలువ... ఆనందంతో గంతులేస్తున్న ఎన్నారైలు...

అంతర్జాతీయ మార్కెట్‌లో రూపాయి విలువ నానాటికీ పడిపోతోంది. ముఖ్యంగా, అమెరికా డాలరుకు రూపాయి మారకం విలువ గత కొద్ది రోజులుగా పడిపోతోంది. శుక్రవారం కూడా విలువ మరింతగా పడిపోయి రూ.71కి చేరుకుంది.

అంతర్జాతీయ మార్కెట్‌లో రూపాయి విలువ నానాటికీ పడిపోతోంది. ముఖ్యంగా, అమెరికా డాలరుకు రూపాయి మారకం విలువ గత కొద్ది రోజులుగా పడిపోతోంది. శుక్రవారం కూడా విలువ మరింతగా పడిపోయి రూ.71కి చేరుకుంది. 
 
అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, ముడిచమురు ధరల్లో పెరుగుదల వెరసి రూపాయి పతనం కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్‌కు డిమాండ్ పెరగడంతో పాటు పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ముడిచమురు ధరలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఫారెక్స్ మార్కెట్‌లో రూపాయి విలువ 26 పైసలు పడిపోయింది.
 
గురువారం ట్రేడింగ్ సెషన్‌లో రూ.70.74 వద్ద ముగిసిన రూపాయి విలువ తాజాగా మరో 26 పైసలు కోల్పోయి తొలిసారిగా రూ.71కు దిగజారి ఆల్ టైం గరిష్టానికి చేరుకుంది. చమురు సెగకుతోడు అమెరికా చైనా వాణిజ్య యుద్ధం భయం, దేశంలో ద్రవ్యోల్బణంపై ఆందోళనలు నెలకొన్న వేళ రూపాయి పతనం శుక్రవారం కూడా కొనసాగింది. 
 
మరోవైపు, ఎన్నారైలు తెగ సంతోషపడిపోతున్నారు. మరీ ముఖ్యంగా అమెరికాలో పని చేసే భారత సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు తెగ సంబరబడిపోతున్నారు. డాలరుతో పోల్చితే రూపాయి విలువ పతనకావడంతో వారు విచారం వ్యక్తం చేయడానికి బదులు సంతోషం చెందుతున్నారు. ఎందుకంటే.. డాలర్ల రూపంలో భారత్‌కు డబ్బులు పంపితే... వాటికి భారత కరెన్సీలో పెద్ద మొత్తం వస్తుందన్నది వారి సంతోషానికి కారణంగా వుంది.